విశ్వసనీయతకే పట్టాభిషేకం... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశ్వసనీయతకే పట్టాభిషేకం...

విశ్వసనీయతకే పట్టాభిషేకం...

Written By news on Sunday, July 14, 2013 | 7/14/2013

ఆనాడు నల్లకాలువలో తానిచ్చిన మాట కోసం జననేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిగారు పడుతున్న కష్టాలు, ఆయన కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధ, ఆవేదన కలుగుతున్నాయి. కానీ ఇచ్చిన మాటకోసం కష్టమొచ్చినా, నష్టమొచ్చినా కట్టుబడి ఉండే ఒక నిబద్ధత కలిగిన నిప్పులాంటి నాయకుడిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ కాలపు దిగజారుడు రాజకీయ ప్రమాణాల నేపథ్యంలో జగన్ వంటి స్వచ్ఛమైన నాయకుడు రాష్ట్ర ప్రజలకు ఒక ఆశాకిరణం. 

జగన్ ప్రారంభించిన ఓదార్పుయాత్ర తొలిరోజు నుండి వ్యతిరేకతలకు, స్వపక్ష విపక్ష విమర్శలకు గురవుతూనే వ చ్చింది. ఈ కార్యక్రమంలోని మానవతా కోణాన్ని వారు చూడలేకపోయారు. అందరూ కట్టకట్టుకుని ఓదార్పును రాజకీయం చేసేశారు. ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. రాజకీయంగా బెదిరించారు. ప్రలోభపెట్ట చూశారు. తమ నాలుకల కింద దాగి వున్న విషాన్ని, వైషమ్యాన్ని వెళ్లగక్కుతూ తమ రాజకీయ వికృత రూపాల్ని బయట పెట్టుకున్నారు. విలువలనే కాదనుకుంటే, అందరిలా పదవే తన ధ్యేయం అని తలచివుంటే జగన్ ఏనాడో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ ఒక ప్రముఖ నాయకుడు అయ్యేవారు. గొప్ప పదవి పొంది వుండేవారు. అయితే ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం తన తండ్రి ఏ పథకాలనైతే ప్రవేశపెట్టారో ఆ పథకాల ఫలాలన్నీ ప్రతి ఒక్కరికీ నిరంతరం నిరాటంకంగా అందాలి, చెందాలి అన్న దృఢ సంకల్పంతో, తపనతో పట్టుదలగా నిలబడ్డారు. ఏ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికైతే తన తండ్రి కలలు కన్నారో ఆ ప్రజా సంక్షేమ స్వప్నం సాకారం చేసేందుకు నడుం బిగించారు.

నాయకుడంటే ప్రజలతో మమేకమై వారి బాధలు, భావాలు తనవిగా చూడగలిగేవాడు. జగన్ సరిగ్గా ఇలాంటి నాయకుడే. అందుకే జన నీరాజనాలు అందుకుంటున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులందరికీ దడ పుట్టిస్తున్న అంశం. జగన్మోన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనేశక్తి లేక ఆయన వ్యక్తిగత విషయాలపై అస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. వారి మతవిశ్వాసాలను సైతం అపహాస్యం చేస్తున్నారు. విజయమ్మగారు చేతిలో బైబిల్ పట్టుకుంటే, బైబిల్‌తో క్రైస్తవులను ప్రభావితం చేయాలని చూస్తున్నారని అంటున్నారు! వై.ఎస్.కుటుంబాల వారు ఇవాళ కొత్తగా క్రైస్తవులు కాలేదు. గత నాలుగు తరాలుగా ఈ కుటుంబం క్రైస్తవ విశ్వాస సంప్రదాయాల్లో నడుచుకుంటోంది. సర్వమతస్తులతో, ఒక సోదర భావంతో మెలిగిన సంస్కారవంతమైన నేపథ్యం వీరి కుటుంబానిది.

రాజకీయ కక్ష సాధింపు కుట్రలో భాగంగానే ఈరోజు జగన్ జైల్లో ఉండవలసి వచ్చిందన్నది సుస్పష్టం. తత్కారణంగా ఆయన భార్య, పిల్లలు, తల్లి, చెల్లి, ఇంకా ఆ కుటుంబాన్ని ప్రేమించే కోట్లాదిమంది హృదయాలు తల్లడిల్లుతున్నాయి. అంతా కష్టాల్లో, శ్రమల్లో ఉన్నారు. బైబిల్‌లో ఒక మాట ఉంది. ‘శ్రమల్లో ఓర్పు పుడుతుంది, ఈ ఓర్పు పరీక్షించబడుతుంది, ఈ పరీక్షా సమయంలోనే ఒక నిరీక్షణ ఏర్పడుతుంది, ఆ నిరీక్షణే నిజం అవుతుంది’. కాబట్టి జగన్ కోసం నిరీక్షిస్తున్న వారందరి శ్రమ ఫలిస్తుంది. జగన్ విడుదల తథ్యం. విశ్వసనీయతకు ప్రజలు పట్టాభిషేకం చేయడం కచ్చితం. 

- రెవరెండ్ పి.ఐజక్ వరప్రసాద్, పులివెందుల
Share this article :

0 comments: