'కోవర్టుగా మారితే సాయం చేస్తామన్నారు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'కోవర్టుగా మారితే సాయం చేస్తామన్నారు'

'కోవర్టుగా మారితే సాయం చేస్తామన్నారు'

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

కాంగ్రెస్‌లో న్యాయం జరగదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాధ్ బాబు తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లగా పార్టీకి సేవ చేస్తే.... కాంగ్రెస్ మాత్రం తన అన్నను మోసం చేసిందని ఆరోపించారు. బీసీలమయినందునే తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుపై విసిగిపోయే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. 

ఆరోగ్యం బాగోలేదన్నా తన సోదరుడిని కనికరించలేదని హరినాధ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సాయం కోసం మంత్రి కొండ్రు మురళిని బతిమాలినా పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మోపిదేవిని కోవర్టుగా మారమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సూచించారని ఆయన తెలిపారు. 

తన సోదరుడు కోవర్టుగా మారితే సాయం చేస్తామని పనబాక చెప్పారన్నారు. వైద్యం కోసం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కాళ్లు కూడా పట్టుకున్నామని హరినాధ్ బాబు తెలిపారు. తాను నమ్ముకున్న నాయకుడు వైఎస్ జగన్ అని ....వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందని హరినాధ్ బాబు అన్నారు.
Share this article :

0 comments: