ఆరు పీఏసీఎస్‌లకు చైర్మన్ల ఎంపిక రెండు చోట్ల కోరంలేక వాయిదా
వరంగల్, న్యూస్‌లైన్:
వరంగల్ జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్ల ఎన్నిక నాలుగు చోట్ల పూర్తికాగా, రెండు చోట్ల వాయిదా పడింది. ఆరు సహకార సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్ని కలను అధికారులు ఆదివారం నిర్వహించారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుకొండ, ఊకల్, పెద్దాపురం సంఘాల చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయింది. ఈ మూడు సంఘాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు కోలా రమేష్, కక్కెర్ల శ్రీనివాస్, గట్ల భగవాన్‌రెడ్డి చైర్మన్లుగా గెలుపొందారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్‌గఢ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పొన్నాల సోమిరెడ్డి చైర్మన్‌గా విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలోని ధర్మసాగర్‌లో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ డెరైక్టర్ స్థానాలున్నప్పటికీ కోరం లేక వాయిదా పడింది. పరకాల నియోజకవర్గంలోని పెంచికలపేటలో కోరం లేక వాయి దా వేశారు. వాయిదా పడిన స్థానాల్లో సోమవారం ఉదయం 9 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ సారి ఎన్నికకు కోరంతో సంబంధం లేదని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి స్పష్టం చేశారు.
వరంగల్, న్యూస్‌లైన్:

0 comments:
Post a Comment