నా దృష్టిలో వైఎస్సార్.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా దృష్టిలో వైఎస్సార్..

నా దృష్టిలో వైఎస్సార్..

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013

మహానేత పథకాలను చిత్రికపట్టిన చిన్నారులు
‘నా దృష్టిలో వైఎస్సార్’ పోటీలకు విశేష స్పందన

సాక్షి,హైదరాబాద్: ఆ చిట్టి చేతుల్లో మహానేత రూపం ఊపిరి పోసుకుంది. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రంగులద్దుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ వెంగళరావునగర్‌లోని బ్రహ్మం టాలెంట్ హైస్కూల్లో ‘నా దృష్టిలో వైఎస్సార్’ అనే అంశంపై నిర్వహిం చిన చిత్రలేఖన పోటీలో పాల్గొన్న చిన్నారులు తమ చిత్రాలతో మహానేతకు నివాళి అర్పించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులు రంగురంగుల చార్ట్‌లు, పెన్సిల్స్, స్కెచ్ పెన్నులు, బ్రష్‌లు చేతపట్టి.. వారి దృష్టిలో వైఎస్సార్‌కు చిత్రరూపమిచ్చారు. ఈ పోటీలను సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి పర్యవేక్షించారు.

పథకాలను చిత్రిక పట్టి..
వైఎస్సార్ హయాంలో పేదల కోసం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన తీరు, పథకాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న వైనం ఇలా వంద ల సంఖ్యల్లో వివిధ రకాలుగా చిత్రాలను గీశారు. చిత్రాలు వేయడంతోపాటు చాలా మంది చిన్నారులు వాటిపై పేదల దేవుడు వైఎస్సార్, ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్, రైతుబాంధవుడు అంటూ రాశారు. చివరిగా హ్యాపీ బర్త్‌డే వైఎస్సార్ అని రాసిన కామెంట్స్ ఆక ట్టుకున్నాయి. ఈ సందర్భంగా తమ పిల్లల కోసం స్కూలు గేటు బయట వేచి ఉన్న వివిధ జిల్లాలకు చెందిన తల్లిదండ్రులు వైఎస్‌పై ఉన్న అభిమానంతోనే ఇంత దూరం వచ్చామని చెప్పారు.

చిన్నారులేమన్నారంటే.. 
వైఎస్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అందుకే ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చాను. వైఎస్సార్ చేసిన అభివృద్ధినే తీసుకుని.. బొమ్మలు వేశాను 
- భువనేశ్వరి, బాచుపల్లి

వైఎస్సార్ బొమ్మలు గీస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన చాలా అభివృద్ధి చేశారు. ఏ సబ్జెక్టు అయినా తీసుకుని వేయవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన సాక్షికి చాలా థాంక్స్.

నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. మా నాన్న ఎప్పుడూ వైఎస్ గురించే చెబుతుంటారు. అందుకే ఇక్కడ వరకు వచ్చా.
- మధు, యానాం, పుదుచ్చేరి

ఎప్పుడు స్కూల్‌లో పెయిం టింగ్ పోటీలు పెట్టినా.. వైఎస్‌కు సంబంధించిన ఫోటోలనే వేయడానికి ఇష్టపడుతుంటా. ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. 
- శివదత్తా, వరంగల్ 

స్టూడెంట్స్‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా ఏ రోగం వచ్చినా కార్పొరేట్ హా స్పిటల్‌లో చికిత్స ఇవ్వ డం.. ఇవన్నీ ఎంతో నచ్చాయి. ఆ అంశాలన్నీ కలిపి బొమ్మ గీశాను. - దీపక్‌కుమార్, నల్లగొండ
Share this article :

0 comments: