వైఎస్ విజయమ్మ ఫీజు దీక్ష వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ విజయమ్మ ఫీజు దీక్ష వాయిదా

వైఎస్ విజయమ్మ ఫీజు దీక్ష వాయిదా

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ చేపట్టనున్న ఫీజు దీక్ష వాయిదా పడింది. ఈ నెల 14, 15 తేదీల్లో విజయమ్మ ఫీజు దీక్ష చేస్తారని వైఎస్సార్ సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దృష్టా వాయిదా దీక్షను వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.



‘కాంగ్రెస్ నాటకం మరోసారి బయటపడింది’

హైదరాబాద్: కాంగ్రెస్ కోర్ కమిటీ నాటకం మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలంగాణ అంశంపై నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు బాజిరెడ్డి, గట్టు రామచంద్రరావులు మండిపడ్డారు. మూడు ప్రాంతాలను ప్రజలను మభ్య పెట్టి పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందన్నారు. ఇలాంటి మోసం జరుగుతుందని ముందే ఊహించామని వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ కాదు.. చోర్ కమిటీ అని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: