మూడు సొసైటీలు వైఎస్సార్సీపీ కైవసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడు సొసైటీలు వైఎస్సార్సీపీ కైవసం

మూడు సొసైటీలు వైఎస్సార్సీపీ కైవసం

Written By news on Sunday, July 7, 2013 | 7/07/2013

వరంగల్ జిల్లాలోని ఆరు సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో మూడు స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఆరు సంఘాల ఎన్నికలు గతంలో వాయిదా వేయగా, శనివారం ఎన్నికలు నిర్వహించారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని ఈ సహకార సంఘాల్లో మూడింటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకొని తన పట్టును నిరూపించుకుంది. మరోరెండు సంఘాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు, ఒక సంఘంలో స్వతంత్ర అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. ఈ సంఘాల్లోని 78 డెరైక్టర్ స్థానాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

ఇందులో మూడు టీఆర్‌ఎస్, ఒకటి వైఎస్సార్ సీపీ, ఒకటి టీడీపీ బలపరిచిన అభ్యర్థి, ఒకటి స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. ఎన్నికలు జరిగిన 72 స్థానాల్లో 31 స్థానాలను వైఎస్సార్‌సీపీ, 26 స్థానాలను టీఆర్‌ఎస్, 12 స్థానాలను టీడీపీ, 2 స్థానాలు కాంగ్రెస్, ఒకటి బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, ఊకల్ హవేలి, పెద్దాపురం సంఘాల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు మైజార్టీ డెరైక్టర్ స్థానాలు దక్కించుకున్నందున చైర్మన్ స్థానాలు కూడా వారికే లభించనున్నాయి. ఇదే నియోకవర్గంలోని పెంచికల్‌పేటలో మాత్రం స్వతంత్ర అభ్యర్థికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, జఫర్‌గఢ్ సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. చైర్మన్ పీఠం ఆ అభ్యర్థులే దక్కించుకోనున్నారు. డెరైక్టర్ స్థానాల ఎన్నికలు పూర్తయినందున ఆదివారం చైర్మన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నికను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 11.30 గంటలకు పరిశీలన, మధ్యాహ్నం 2గంటలకు ఉపసంహరణ తదుపరి పోటీలో ఉన్న వారి పేర్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: