దీక్షకు పలు సంఘాల మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీక్షకు పలు సంఘాల మద్దతు

దీక్షకు పలు సంఘాల మద్దతు

Written By news on Saturday, July 20, 2013 | 7/20/2013


 ‘పెద్ద చదువులు...పేదలందరి హక్కు!’ అనే నినాదంతో అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా వర్తింపజేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రెండు రోజులపాటు చేసిన నిరాహారదీక్షకు వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మద్దతు లభించింది. దీక్ష మొదలైనప్పటి నుంచీ ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా శిబిరానికి వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతూ వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. గురువారం ఉదయం ప్రారంభమైన దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పేటెంట్ ఉందని తన దీక్ష ద్వారా విజయమ్మ చాటి చెప్పారు. ఫీజుల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయమ్మ గతంలో ఇదే విధంగా రెండేసి రోజుల పాటు రెండు దఫాలు దీక్షలు చేశారు.

మూడోసారి చేసిన దీక్షకు జంటనగరాలతో సహా పరిసరాల్లోని ఇంజనీరింగ్, ఇతర వృత్తి కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో విజయమ్మతో కలిసి దీక్షలో కూర్చున్నారు. పలు ప్రజా సంఘాల నేతలు శుక్రవారం కూడా వచ్చి ఫీజులు లేక లక్షలాది మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, రోజా, కూన శ్రీశైలం గౌడ్, జ్యోతుల నెహ్రూ, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, జనక్‌ప్రసాద్, నందమూరి లక్ష్మీపార్వతి తదితరులు దీక్షా వేదికపై మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నేతలు కొణతాల రామకృష్ణ, ఎం.వి.మైసూరారెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), గొట్టిపాటి రవికుమార్‌తో సహా పలువురు ప్రముఖులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు.

భారీగా బీసీల మద్దతు: పలువురు బీసీ సంఘాల నేతలు విజయమ్మను కలిసి తమ మద్దతు ప్రకటించారు. దీక్ష తొలి రోజునే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తన అనుచరులతో తరలివచ్చారు. బీసీ యునెటైడ్ ఫ్రంట్ నాయకుడు పాలూరి రామకృష్ణయ్య, ఆరెకటిక సంఘం నాయకులు గురు చరణ్, సురేష్ , నాయీ బ్రాహ్మణ సంఘం, రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం ప్రతినిధులు దీక్షకు వచ్చారు. మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ఆర్య వైశ్య సంఘం, నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు కూడా దీక్షకు తరలి వచ్చి తమ మద్దతు ప్రకటించారు.
Share this article :

0 comments: