ఉండవల్లివి చిలుక పలుకులు: గోనె - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఉండవల్లివి చిలుక పలుకులు: గోనె

ఉండవల్లివి చిలుక పలుకులు: గోనె

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013


ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ సోనియా నివాసం టెన్‌జన్‌పథ్ బంట్రోతులా, పంజరంలో చిలకలా విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... వార్షిక నివేదిక పేరిట ఉండవల్లి రాజమండ్రిలో పెట్టిన సభలో తనకు వచ్చే రూ.5 కోట్ల నిధులు ఎలా ఖర్చయ్యాయో సమీక్షించే బదులు జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలకే ఎక్కువ సమయం కేటాయించారని తప్పుబట్టారు. ‘‘వైఎస్ జగన్ 2009లో రూ.77 కోట్లు ఆదాయం చూపించారని, 2011లో అది రూ.427 కోట్లకు ఎలా పెరిగిందని అరుణకుమార్ అడుగుతున్నారు.

భారతి సిమెంట్స్ ఉత్పత్తి ప్రారంభించి నాణ్యమైన సిమెంటును మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించాక దాని విలువ ఎంతో పెరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీ 50 శాతం షేర్లను రూ.2,600 కోట్లకు కొనుగోలు చేసింది. అందులో వచ్చిన రూ.434 కోట్ల లాభానికి కే పిటల్ గెయిన్ కింద జగన్ రూ.84 కోట్లు కట్టారు. ఇంగితజ్ఞానం లేకుండా దానిపైనా విషప్రచారం చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. తెలంగాణపైనా అరుణకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలన్నది ఎక్కడా లేదని గోనె స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రానికి పూర్తి అధికారముందని చెప్పారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయకుండా ఇరుప్రాంతాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సముచిత నిర్ణయం తీసుకోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టంచేసిందని తెలిపారు.
Share this article :

0 comments: