'మమతా ఫోన్ కాల్ అంశంపై జగన్ తో చర్చిస్తాం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'మమతా ఫోన్ కాల్ అంశంపై జగన్ తో చర్చిస్తాం'

'మమతా ఫోన్ కాల్ అంశంపై జగన్ తో చర్చిస్తాం'

Written By news on Monday, July 8, 2013 | 7/08/2013

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ కాల్ అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్‌ కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. అనంతరం పార్టీలో చర్చించే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన సోమవారమిక్కడ అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా 30 ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మైసూరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని ఆయన అన్నారు.

జాతీయ రాజకీయాల్లోకలసి పనిచేద్దామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.

Share this article :

0 comments: