బాధితులకు భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాధితులకు భరోసా

బాధితులకు భరోసా

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

శ్రీకాకుళం: ‘‘కిడ్నీ జబ్బుతో సానా బాధపడుతున్నాం. నయమవ్వక సచ్చిపోతున్నాం తల్లీ.. ఎవరు పట్టించుకోట్లేదు. కేజీహెచ్ డాటర్లకు చూపిస్తే మందు లు ఈయటమే లేదు. జబ్బు తగ్గడం లేదు..’’ అంటూ ఉద్దానం ప్రాంతానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు షర్మిల వద్ద వాపోయారు. సారవకోట మండలం అలుదు గ్రామం వద్ద పలువురు కిడ్నీ బాధితులు షర్మిలను కలిసి తమ గోడు వినిపించారు.

కంచిలి, కవిటి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కిడ్నీ వ్యాధులతో జనం సానా ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం సర్వేలు చేయడమే తప్ప వ్యాధి నయం చేయడం లేదని చెప్పారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోలేదా అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న వైద్యుడు హరికృష్ణ ఆరోగ్యశ్రీ నుంచి కిడ్నీ వ్యాధిని తొలగించారని షర్మిలకు వివరించారు. జగనన్న సీఎం కాగానే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని షర్మిల బాధితులకు భరోసా ఇచ్చారు.

షర్మిలకు ఓ మానసిక వికలాంగ బాలుడి తల్లి మొర
సాక్షి, శ్రీకాకుళం: ‘‘అమ్మా.. నా కొడుక్కి బయట పెపంచం తెలీడం లేదు. నన్ను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎన్ని ఆస్పత్రుల్లో చూపిచ్చినా బాగవడంలేదు.. మీరే దారి సూపాలి’’ అంటూ సారవకోట మండలం బొంతు జంక్షన్‌కు చెందిన ఓ తల్లి మానసిక వికలాంగుడైన తన తొమ్మిదేళ్ల కుమారుడు సురవరపు ప్రదీప్‌కుమార్‌ను షర్మిలకు చూపి కన్నీళ్లపర్యంతమైంది. ఆ కన్నతల్లి బాధ విన్న షర్మిల ఆ బాలుడిని అక్కున చేర్చుకున్నారు. బాలుడి తల్లి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న అధికారంలోకి రాగానే మీ సమస్య తీరుతుందని భరోసానిస్తూ ముందుకు సాగారు.

పైలాన్ పనులు వేగవంతం
షర్మిల పాదయాత్ర ముగియనున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద నిర్మిస్తున్న పైలాన్ నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, సీనియర్ నేత ఎం.వి. కృష్ణారావు తదితరులు ఆదివారం పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించారు.
- న్యూస్‌లైన్,ఇచ్చాపురం
Share this article :

0 comments: