సీట్లు, ఓట్లు రాజకీయంతో ప్రజల భవితను తాకట్టు పెడతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీట్లు, ఓట్లు రాజకీయంతో ప్రజల భవితను తాకట్టు పెడతారా?

సీట్లు, ఓట్లు రాజకీయంతో ప్రజల భవితను తాకట్టు పెడతారా?

Written By news on Friday, July 26, 2013 | 7/26/2013

స్పీకర్‌కు16 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల లేఖలు
స్పీకర్ ఫార్మాట్‌లో ఆయన కార్యాలయానికి ఫ్యాక్స్ 
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో కాంగ్రెస్ చెలగాటమాడుతోంది
సీట్లు, ఓట్లు రాజకీయంతో ప్రజల భవితను తాకట్టు పెడతారా?
కుట్రలను ఎండగట్టడానికే రాజీనామాలు చేశామని వెల్లడి
 రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ సీట్లు, ఓట్ల రాజకీయంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వైఖరికి నిరసనగా తమ రాజీనామా లేఖలను శాసనసభ స్పీకర్‌కు పంపించారు. ఈ సందర్భంగా వారు ఆయా ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి సంబంధించి తన వైఖరేంటో ఇంతవరకు ప్రకటించకుండా సమస్యను మరింత గందరగోళంలోకి నెట్టి రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న లక్ష్మణరేఖను తుడిపేసింది. తానే పార్టీ, తానే ప్రభుత్వమన్న విధంగా వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రజల భవిష్యత్తును కాంగ్రెస్ తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తోంది. 

తెలంగాణ ఇస్తే ఎన్ని సీట్లొస్తాయి, రాయల తెలంగాణ చేస్తే ఎన్ని సీట్లొస్తాయి, సమైక్యంగా ఉంచితే ఎన్ని సీట్లు గెలుస్తామంటూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ బేరసారాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’అని వారు పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలా కాకుండా, ఇదేదో కాంగ్రెస్ సొంత భవిష్యత్తుకు సంబంధించిన విషయమన్నట్టుగా రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ, అటు ఢిల్లీలోనూ ఆ పార్టీ ఒక వికృత క్రీడకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక గందరగోళం సృష్టించి ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటోందంటూ తూర్పారబట్టారు. ‘రాష్ట్ర భవిష్యత్తును ఏకపక్షంగా నిర్ణయిస్తాం, మేం ఎన్ని సీట్లు గెలుస్తామన్నదే మా నిర్ణయంలో కీలకమవుతుంది’ అని కాంగ్రెస్ పార్టీ నిర్లజ్జగా ఒప్పుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా, దాని వెనుక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అంతా సీట్లు, ఓట్లు, అధికారం కోసం కాంగ్రెస్ రాజకీ య క్రీడలో భాగమేనని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతూనే ఉందన్నారు. ఈ దుర్మార్గమైన విధానాన్ని రాష్ట్ర ప్రజల తరఫున నిరసిస్తూ, వారి భవిష్యత్తును కాపాడే బాధ్యతగల రాజ కీయ పక్షంగా, ప్రజాప్రతినిధులుగా తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు సమర్పిస్తున్నట్టు వారు ప్రకటించారు.

నిర్ణయంపై అందరితో చర్చించాలి

రాష్ట్రానికి సంబంధించి ఏ నిర్ణయమైనా అందరి ఆమోదంతోనే జరగాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ‘‘ఈ విషయంలో మొదట కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం ప్రకటించాలి. ఆ తర్వాత కేంద్రం అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, ఏ ఒక్కరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా ఒక ప్రతిపాదనను అందరి ముందుంచాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు’’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తన కుట్రపూరితమైన బుద్ధి ద్వారా రాష్ట్రాన్ని కేవలం తన సీటు, అధికారం కోసం బేరసారాలు సాగిస్తూ... ప్రజలందరికీ అన్యాయం చేసేం దుకు సిద్ధమైందని రుజువవుతున్న నేపథ్యంలో వారి కుట్రలను నిలువరించేందుకే తాము రాజీనామాలు చేస్తున్నట్టు వివరించారు.

ప్రాణత్యాగానికైనా సిద్ధం: గడికోట

రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటే తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ స్వలాభం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని నవ్వులపాలు చేయొద్దని కాంగ్రెస్‌కు ఆయన సూచించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని విభజించే ముందు ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి’ అని సూచించారు. కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. 

‘ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నాడు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ప్రకటించేయడం, ఏ రకంగా రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయంగా తమకు అనుకూలంగా ఉంటుందా అని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేయడం, మరోవైపు రాయల తెలంగాణ అంటూ కొత్త పాటను ఎత్తుకోవడం... ఈ విషయాలన్నింటిపై పూటకొక లీకులతో రాష్ట్ర ప్రజలను గందరగోళపరిచి, వారి మధ్య మరింతగా వైషమ్యాలను పెంచేలా కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. రాయలసీమను చీల్చే అధికారం ఎవరిచ్చారు? రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం మీ రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటారా? రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ఇప్పటివరకూ ఎందుకు చెప్పడం లేదు?’ అని శ్రీకాంత్ సూటిగా ప్రశ్నించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు అడుగుతున్నారే కానీ, కాంగ్రెస్ అభిప్రాయమెందుకు చెప్పడం లేదని నిలదీశారు. ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ ఆటలు కట్టిపెట్టి రాష్ట్ర శ్రేయస్సుకు పనిచేయాలని ఆ పార్టీకి సూచించారు.

రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)
మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు)
ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
బి.గుర్నాథరెడ్డి (అనంతపురం)
భూమా శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ)
టి.బాలరాజు (పోలవరం)
గొల్ల బాబూరావు (పాయకరావుపేట)
బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)
కె.శ్రీనివాసులు (రైల్వే కోడూరు)
భూమన కరుణాకర్‌రెడ్డి (తిరుపతి)
కడిమెట్ల చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)
ఆకేపాటి అమర్‌నాథరెడ్డి (రాజంపేట)
Share this article :

0 comments: