సీబీఐపైనే అసలు విచారణ చేపట్టాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐపైనే అసలు విచారణ చేపట్టాలి

సీబీఐపైనే అసలు విచారణ చేపట్టాలి

Written By news on Wednesday, July 17, 2013 | 7/17/2013

50 ఏళ్ల సీబీఐ కేసుల చరిత్రలో ముగ్గురికి మాత్రమే శిక్ష పడింది
విజయవాడ ‘సాక్షి’ చైతన్యపథంలో మేధావులు, వక్తలు

సాక్షి, విజయవాడ: దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి. దేశంలో నియంతపాలన సాగుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు హిట్లర్, ముస్సోలినీలు పాలన చేస్తున్నట్లు ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పు. ఎవరినైనా జైలుకు పంపిస్తారు. అలాంటప్పుడు ఇది ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది. దేశంలో మిగిలిన కేసుల్లో లేని విధంగా జగన్ కేసులో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ను అరెస్టు చేసి విచారణ పేరుతో కేసును సాగదీస్తూ తరచూ చార్జీషీట్ దాఖలు చేసి బెయిల్ రాకుండా చేయడం ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని విజయవాడ నగరవాసులు నినదించారు. మంగళవారం విజయవాడ నగరంలో ‘సాక్షి’ చైతన్య పథం స్ధానిక జిల్లాకోర్టు సమీపంలోని ఎ.ఎస్.రామారావు హాలులో జరిగింది. సదస్సులో మేధావులు వివిధరంగాల నిపుణులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ, సీబీఐలు సమష్టిగా చేస్తున్న కుట్రలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీవీఎన్ కిశోర్ వ్యాఖ్యాతగా జరిగిన ఈ సదస్సులో ఫోరమ్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు బీబీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మందలించినా సీబీఐ, ప్రభుత్వ తీరులో మార్పురాలేదన్నారు. తప్పుడు కేసులు, ఆక్రమ కేసులతో కాలం గడుపుతన్న సీబీఐ దర్యాప్తు తీరుపైనే అసలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీబీఐ 50 ఏళ్ల చరిత్రలో కేవలం ఆర్థికపరమైన కేసుల విచారణలో ముగ్గురికి మాత్రమే శిక్షలుపడ్డాయని, ఇందులో సుఖ్‌రామ్, బంగారు లక్ష్మణ్, మరొకరు శిక్ష అనుభవించారని, మిగిలిన కేసులన్నీ బెదిరింపులకే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. జనవిజ్ఙాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు జంపా కృష్ణకిశోర్ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగా జగన్‌ను లక్ష్యంగా చేసి కక్షపూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అన్నారు. 

సీనియర్ న్యాయవాది మణెమ్మ మాట్లాడుతూ, విచారణ అనంతరం అన్ని అంశాలతో ఒక చార్జీషీట్‌నే కోర్టుకు సమర్పించాలని, అలాకాకుండా నాలుగైదు చార్జీషీట్లు కోర్టుకు సమర్పించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. విశ్రాంత అధ్యాపకుడు జేడీ విల్సన్ మాట్లాడు తూ, అధికార పార్టీకి సీబీఐ వల్లే ఘోర ఓటమి తప్పదని హెచ్చరించారు. ముస్లిం మతగురువు మౌలానా మహ్మద్ ముఫ్తార్ అలీ అహ్మద్ మాట్లాడుతూ, సీబీఐది పూర్తి కుట్రపూరిత చర్యగా ప్రతి సగటు పౌరుడికీ అర్థమవుతోందన్నారు. ప్రముఖ వైద్యుడు చైతన్య మాట్లాడుతూ, జగన్‌కోసం కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారని ఇకనైనా కాంగ్రెస్, సీబీఐ బుద్ధి తెచ్చుకుని జననేతను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: