ప్రజానాయకుడిని జైల్లో వేశారు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజానాయకుడిని జైల్లో వేశారు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు

ప్రజానాయకుడిని జైల్లో వేశారు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

తెలుగునాట ఇందిరా కాంగ్రెస్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఇందిరా గాంధీ కాదు, సోనియాగాంధీ కాదు, రాహుల్‌గాంధీ కారు. రాజశేఖరరెడ్డిగారు మాత్రమే గుర్తుకొస్తారు. ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ కోట్లాది జీవితాలలో వెలుగులు నింపింది. జీవన ప్రమాణాలను మెరు గుపరిచింది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం రాజశేఖరెడ్డిగారి పథకాలు ఆకర్షించాయి. ప్రధానంగా 108 ప్రపంచంలోనే వినూత్నమైన, ప్రజోపకారమైన వైద్యసేవా పథకంగా మన్ననలు పొందింది. 

అంతస్థులుగా వైద్యశాలలు నిర్మిస్తున్నారు కానీ, అంతకంటే ముఖ్యం ఆపదలో ఉన్న వ్యాధిగ్రస్తులను, రోడ్డు ప్రమాదంలో రక్తపు మడుగులో పడివున్న వారిని ఆసుపత్రికి చేర్చడం కదా! రాజన్న ఆ పనే చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులలో సైతం పేదవారికి సేవలు అందేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుపరిచారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేవి. ఆయన మరణించాక అంతా తల్లకిందులైంది. పేదల్ని, మధ్యతర గతి వారిని పట్టించుకునే నాయకుడే కరవయ్యాడు. ఈ దశలో నేనున్నానంటూ వచ్చిన రాజన్న తనయుడు జగనన్న ప్రజల మధ్యకు వెళుతుంటే ఈ కుటిలనాయకులు ఆపి, నిర్బంధించారు. అంతటితో ఆగక, బయటికి రాకుండా అడ్టుకుంటున్నారు. 

ప్రజలు మెచ్చిన, ప్రజలు ఆదరిస్తున్న ఒక యువనాయకుడిని ప్రజల మధ్యకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం అక్రమం కాదా? ప్రజలకు ద్రోహం చేయడం కాదా? దీనిని ఎవరూ ప్రశ్నించరేం? దీనిపై ఎవరూ కోర్టులో పిటిషన్ వేయరేం? న్యాయస్థానాలైనా స్వచ్ఛందంగా ఇలాంటి అంశాలను ప్రజాప్రయోజనాల రీత్యా పరిగణనలోకి తీసుకోవచ్చు కదా. రాష్ట్రంలో ఇప్పుడేం జరుగుతోందో చూడండి. ప్రజానాయకుడిని జైల్లో వేశారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేశారు. ఎంత దారుణం! జగన్, ఆయన కుటుంబసభ్యులు సహనమూర్తులు కావచ్చు. కానీ వారిని వేధిస్తుంటే చూస్తూ కూర్చునేంత సహనం ప్రజల్లో లేదు. అవకాశం కోసం చూస్తున్నారు. అది రాగానే వాళ్లే జగన్‌ని జైలు నుంచి విడిపించుకుంటారు. జగన్ కుటుంబాన్ని అక్కున చేర్చుకుంటారు. 

- పల్లంరెడ్డి రామిరెడ్డి, చేపలసాగు రైతు, లేబూరు, నెల్లూరు జిల్లా

ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్ ఒక్కరే

జగన్‌ని అక్రమంగా జైల్లో పెట్టించడమే కాకుండా, ఆయన్ని అన్యాయంగా విమర్శిస్తున్నారు ఈ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు. జగన్‌ని ముఖ్యమంత్రిగా జనం కోరుకుంటుంటే వారి అభీష్టానికి విరుద్ధంగా ఆయన్ని నిర్బంధించి వేధించడం ఎవరికీ మింగుడు పడడం లేదు. జగన్ ఎక్కడ సీఎం అవుతారోననే ఒకే ఒక్క భయంతో అన్ని పార్టీలవారూ ఆయన్ని వేధిస్తున్నట్లు స్పష్టమైపోయింది. జగన్ గురించి అంతా తీర్పులిచ్చేవారే. ఓదార్పుయాత్ర చేయరాదని కాంగ్రెస్ తీర్పు ఇచ్చింది. అక్రమంగా ఆస్తులు సంపాదించారని సీబీఐ తీర్పు ఇచ్చింది! టీడీపీలో అయితే ఎవరికి ఇష్టమొచ్చిన తీర్పులు వారు ఇస్తున్నారు. అంతిమతీర్పు ప్రజలదేనని వీరెవరికీ తెలియడం లేదు. అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు రాష్ట్రంలో జగన్ ఒక్కరే. జగనే తమ నాయకుడని రాష్ట్రప్రజలంతా తీర్పు ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఆ సంతోషకరమైన రోజు కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం.

- మురహరి శ్రీధర్‌నాయి, ధూల్‌పేట, హైదరాబాద్
Share this article :

0 comments: