గ్రామీణ వ్యవస్థను నాశనం చేసింది బాబే: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్రామీణ వ్యవస్థను నాశనం చేసింది బాబే: భూమన

గ్రామీణ వ్యవస్థను నాశనం చేసింది బాబే: భూమన

Written By news on Monday, July 22, 2013 | 7/22/2013

గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబుదేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. పంచాయతీ వ్యవస్థను వైఎస్ నిర్వీర్యం చేశారన్న ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని చెప్పారు. బాబు హయాంలో గ్రామాలకు గ్రామాలే పూర్తిగా ఖాళీ అయ్యాయని, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రతీదీ తానే చేశానని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని భూమన అన్నారు. 

పంచాయతీరాజ్ వ్యవస్థపై 'మనసులోమాట' పుస్తకంలో ఏం రాశారో చంద్రబాబు గుర్తుచేసుకోవాలని చెప్పారు. ఆయన ప్రపంచబ్యాంకు తొత్తు అంటూ లోకం కోడై కూయడం వాస్తవం కాదా అని భూమన నిలదీశారు. అసలు గ్రామీణ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదని అన్నారు.




ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కు రాజకీయాల్లో బిజీగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాసు, సుచరిత, శోభానాగిరెడ్డి ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. పదిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో అనేక జిల్లాల్లో అపారనష్టం వాటిల్లిందని వెల్లడించారు.

సహాయచర్యలకోసం అధికారులను పెట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, లంక గ్రామాల్లో వేలాదిమంది సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వరద సహాయక చర్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. నీలం, జల్‌ తుపాను నష్టపరిహార చెల్లింపులను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహించబోదని వారు హెచ్చరించారు.
Share this article :

0 comments: