రైతులను ఆదుకోవాలి : విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులను ఆదుకోవాలి : విజయమ్మ

రైతులను ఆదుకోవాలి : విజయమ్మ

Written By news on Saturday, July 20, 2013 | 7/20/2013

ఆదిలాబాద్: అతలాకుతలమైన ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటించారు. వరద ముంపునకు గురైన పొలాలను ఆమె పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. రైతులను అడిగి జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆమె ఆదిలాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితులను చూసి బాధ కలిగిందన్నారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి త్వరలోనే లేఖ రాస్తానని విజయమ్మ చెప్పారు.


వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పెన్‌గంగ ప్రాజెక్టును పూర్తిచేస్తామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ హామీ   ఇచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వరద ముంపునకు పంటలు పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వచ్చిన వరదతో ముంపునకు గురైన ప్రాంతాలలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ శనివారం పర్యటించారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలోనే కాకుండా ఎగువన మహారాష్ట్రలో కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ నదులు పొంగి ప్రవహించడంతో సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. పంటలు నీటమునిగి కుళ్ళిపోయాయి. జిల్లాలోని జైనథ్‌ మండలం పెండల్‌వాడలో పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. దీనితో శ్రీమతి విజయమ్మ వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా రైతులు శ్రీమతి విజయమ్మకు తమ కష్టాలు చెప్పుకుని ఆవేద వ్యక్తంచేశారు. వర్షాల కారణంగా కుళ్ళిపోయిన పత్తి పంటను ఆమెకు చూపించి విలపించారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వారు వాపోయారు.


https://www.facebook.com/photo.php?fbid=584583828247584&set=a.375213312517971.82316.309587409080562&type=1&theater
Share this article :

0 comments: