మోపిదేవిని బలిపశువును చేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మోపిదేవిని బలిపశువును చేశారు

మోపిదేవిని బలిపశువును చేశారు

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు మోపిదేవి వెంకట రమణను బలిపశువును చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. 26 జీవోల కేసు రాజకీయ ప్రేరేపితమైనదని ఆమె శుక్రవారమిక్కడ అన్నారు. 

మోపిదేవి కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో, జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నామన్నారు. 

మోపిదేవిని అరెస్ట్ చేసే ముందు ....వారం రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని విజయమ్మ అన్నారు. 26 జీవోల కేసులో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. 

అందుకు ప్రతిఫలంగా వైఎస్ను అప్రతిష్ట చేసేందుకు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కలిపి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా అందరూ కలిసి పని చేయాలని విజయమ్మ సూచించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులు తమ అనుచరులతో కలిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం మోపిదేవి కుమారుడు రాజీవ్, సోదరుడు హరినాథ్‌బాబు, రేపల్లె నియోజకవర్గంలోని పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కలిసి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వారు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. విజయమ్మ వారికి కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకు ముందు మోపిదేవి సోదరుడు హరినాధ్ బాబు మీడియాతో మాట్లాడుతూ బీసీలమైనందునే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కక్షకట్టి తమ సోదరున్ని జైలుకు పంపారని ఆరోపించారు. 25ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం తాము సేవ చేసామని, అయితే తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదరించలేదన్నారు.

న్యాయ సహాయం అందించే విషయంలో కూడా ముఖ్యమంత్రి వివక్ష చూపించారని హరినాధ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా కుంటుపడ్డాయన్నారు. తన సోదరుడికి అనారోగ్యంగా ఉన్నా మెరుగైన వైద్య సహాయం కూడా ఉందటం లేదన్నారు.
Share this article :

0 comments: