రాష్ట్రం నుంచి తరలిపోతున్న పరిశ్రమలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రం నుంచి తరలిపోతున్న పరిశ్రమలు

రాష్ట్రం నుంచి తరలిపోతున్న పరిశ్రమలు

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013

పెట్టుబడులకు ముందుకే రాని పారిశ్రామికవేత్తలు
తీవ్ర రాజకీయ అనిశ్చితే ప్రధాన కారణం
కరెంటు కోతలు, సర్కారు వైఖరీ సమస్యే
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకూ దుస్థితే
రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులు హుష్ కాకి
వేలాది మంది ఉపాధి అవకాశాలకు గండి
నిమ్మకు నీరెత్తినట్టుగా సర్కారు తీరు

రాష్ట్రంలో సగటున రోజుకు 3 పరిశ్రమలు మూతపడుతున్నాయని గతంలోనే ఆర్‌బీఐ
నివేదిక నిగ్గుదేల్చింది!

చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో బుల్లెట్ తయూరీ యుూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కూడా చేసుకున్న రాయుల్ ఎన్‌ఫీల్డ్, ముడుపులిస్తే తప్ప రాయితీలిచ్చేది లేదని వుుఖ్యనేత ఒకరు మెలిక పెట్టడంతో తమిళనాడుకు తరలిపోరుుంది.

విశాఖ సమీపంలో 5,000 కోట్ల రూపాయలతో అణు విద్యుత్ పరికరాల యుూనిట్ ఏర్పాటుకు వుుందుకొచ్చిన బ్రైటన్, భూమి కేటాయించకపోవడంతో చైనాకు తరలింది!

5 వేల కోట్లతో కార్ల తయూరీ యుూనిట్‌కు వుుందుకొచ్చిన ఫ్యూజో కంపెనీ భూమి, రారుుతీల విషయుంలో ప్రభుత్వ నిరాసక్తత వల్ల గుజరాత్‌కు వెళ్లింది

కర్నూలు జిల్లాలో రూ.12 వేల కోట్లతో సోలార్ పీవీ వూడ్యూల్స్ యుూనిట్ పెడతామన్న యుశ్‌బిర్లా వుహారాష్ట్రకు తరలిపోయింది. దాని స్థానంలో ఏకంగా 22 వేల కోట్లతో యూనిట్ పెడతానన్న బిర్లా సూర్య కూడా చివరికి వేరే రాష్ట్రాన్ని చూసుకుంది.

రంగారెడ్డి జిల్లాలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీడీఎల్‌కు భూమిని కూడా సేకరించి ఇవ్వలేకపోవడంతో రక్షణ మిస్సైల్స్ తయూరీ యుూనిట్ అనుమానంలో పడింది

సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. రాష్ట్రం నుంచి ఒక్కో పరిశ్రమా క్రమంగా తరలిపోతోంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు జంకుతున్నారు. తీవ్రమైన విద్యుత్ సమస్య, భూ కేటాయింపులో జాప్యం వల్ల కొన్ని, రాజకీయు అనిశ్చితి వల్ల మరికొన్ని పరిశ్రమలు రాష్ట్రం నుంచి నిష్ర్కమిస్తున్నారుు. పెట్టుబడులకు వుుందుకొచ్చి ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్న పలు పరిశ్రమలు కూడా ఇప్పుడు మౌనముద్ర దాల్చాయి. వాటి యూజవూన్యాలకు పరిశ్రమల శాఖ అధికారులు పదేపదే లేఖలు రాయడమే గాక ఫోన్లు కూడా చేస్తున్నా స్పందించడం లేదు. ప్రైవేటు పరిశ్రమల పరిస్థితి ఇలా ఉంటే... రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ యుూనిట్ల ఏర్పాటుకు వుుందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈసీఐఎల్ కూడా తాజాగా వెనక్కు తగ్గింది! మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకిగా మారుతోంది.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీడీఎల్‌కు అవసరమైన భూమిని కూడా సేకరించి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వముంది. దాంతో రంగారెడ్డి జిల్లాలో బీడీఎల్ తలపెట్టిన రక్షణ మిస్సైల్స్ తయూరీ యుూనిట్‌పై నీలినీడలు కవుు్మకుంటున్నారుు. పెట్టుబడులను ఆకర్షించడంలో గతంలో దేశంలో తొలి, రెండో స్థానాల్లో నిలిచిన రాష్ట్రానికి నేడు పారిశ్రామికవేత్తలు వచ్చేందుకే భయుపడే వాతావరణం నెలకొంది. గత మూడున్నరేళ్లలో ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పోయాయని పరిశ్రమల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి!

ఇలా తరలుతున్నారుు...

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అణు విద్యుత్ ప్లాంటు పరికరాల తయూరీ యుూనిట్ ఏర్పాటుకు వుుందుకొచ్చిన కళ్యాణి గ్రూపు సంస్థ తమిళనాడుకు తరలిపోరుుంది. ఫలితంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడే గాక వేలాదివుందికి ఉపాధి కూడా చేజారింది. రాష్ట్రంలోని రాజకీయు అనిశ్చితే ఇందుకు కారణమని స్వయంగా కంపెనీ ప్రతినిధులే పేర్కొన్నారు! విశాఖ సమీపంలో అణు విద్యుత్ పరికరాల తయూరీ యుూనిట్ ఏర్పాటుకు వుుందుకొచ్చిన బ్రైటన్ కంపెనీ కూడా, అవసరమైన భూమి కేటాయించకపోవడంతో తాజాగా వెన క్కి తగ్గింది. దాంతో రూ.4-5 వేల కోట్ల పెట్టుబడి ఏకంగా చైనాకు తరలింది! అయినా ప్రభుత్వానికి చీవుకుట్టినట్టయినా లేదు. 2012 డిసెంబర్‌లో జరిగిన భాగస్వామ్య సదస్సులో జరిగిన 18 పరిశ్రమలు/ఒప్పందాలకు సంబంధిం చిన రూ.1,33,141 కోట్ల పెట్టుబడులు ఇప్పటికే ఆగిపోయా యి. తద్వారా 65 వేల మందికి ఉపాధి లభించే అవకాశాలూ చేజారాయని జూన్ 26న సీఎం కార్యాలయానికి ఇచ్చిన నివేదికలో పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. ఫ్యూజో కార్ల కంపెనీ కూడా రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో కార్ల తయూరీ యుూనిట్ ఏర్పాటుకు వుుందుకొచ్చినా భూమి, రారుుతీలపై ప్రభుత్వ స్పందన సరిగా లేకపోవడంతో గుజరాత్‌కు తరలింది! కర్నూలు జిల్లాలో రూ.12 వేల కోట్లతో సోలార్ పీవీ వూడ్యూల్స్ యుూనిట్ ఏర్పాటుకు వుుందుకొచ్చిన యుశ్ బిర్లా కంపెనీ కూడా చివరికి వుహారాష్ట్రకు వెళ్లిపోయింది. విచిత్రమేమిటంటే... యశ్ బిర్లా స్థానంలో అదే యూనిట్‌ను ఏకంగా రూ.22 వేల కోట్లతో పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థ కూడా మరో రాష్ట్రానికి తరలింది. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితికి ఇవన్నీ నిదర్శనవుని పారిశ్రామికరంగ నిపుణులు అంటున్నారు.

కోతల దెబ్బకు పరుగు: రాష్ట్రంలో పరిశ్రమలకు ఎడాపెడా కోతలు అమలవుతూనే ఉన్నాయి. మొన్నటిదాకా ఏకంగా 12 నుంచి 15 రోజులు కోతలు అమలు చేశారు. నిజానికి గతేడాది ఆగస్టు నుంచే కోతలు ఊపందుకున్నాయి. ఈ దెబ్బకు అనేక పరిశ్రమలు కుదేలై మూతబడుతున్నాయి. మరెన్నో ముక్కుతూ, మూలుగుతూ నడుస్తున్నాయి. రాష్ట్రంలో సగటున రోజుకు 3 పరిశ్రమల చొప్పున మూతపడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక గతంలోనే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కొత్తగా యూనిట్లు పెట్టలేమని పలు పరిశ్రమలు పరిశ్రమల శాఖకు స్పష్టంగా తేల్చి చెబుతున్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్ ఏర్పాటు చేయదలచిన హీమాక్షి బేకర్స్, ఎన్‌కేఎన్ ఆగ్రో కూడా, ‘ఈ కోతల నడుమ పరిశ్రమను ఏర్పాటు చేయలే’మని చెప్పాయి. పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వమేమో ఒక్క పరిశ్రమ కూడా కరెంటు కోతల వల్ల మూతపడలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చింది!

సర్కారు స్పందించక మరికొన్ని: చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయూరీ యుూనిట్ ఏర్పాటుకు రాయుల్ ఎన్‌ఫీల్డ్ ముందుకొచ్చింది. ఒప్పందం కూడా చేసుకుంది. కంపెనీకి భూమిని కేటాయించేందుకు శ్రీసిటీ యూజవూన్యం అంగీకరించింది. పలు రారుుతీలిచ్చేందుకు సీఎం నేతృత్వంలోని ఎస్‌ఐపీబీ కూడా అంగీకరించింది. కానీ ఆ మేరకు జీవోల జారీని పరిశ్రవుల శాఖ నెలల తరబడి నాన్చింది. జీవో ఇచ్చేందుకు పరిశ్రవుల శాఖ వుుఖ్యనేత ఒకరు కంపెనీ నుంచి భారీగా కాసులు డివూండ్ చేయడమే అందుకు కారణమని అప్పట్లో బాగా విన్పించింది. దాంతో ఎన్‌ఫీల్డ్ కాస్తా తమిళనాడుకు తరలిపోరుుంది!
    
Share this article :

0 comments: