ప్రాధమికహక్కులను కాలరాస్తోన్న సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాధమికహక్కులను కాలరాస్తోన్న సీబీఐ

ప్రాధమికహక్కులను కాలరాస్తోన్న సీబీఐ

Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013

- ప్రాధమికహక్కులను కాలరాస్తోన్న సీబీఐ
- జననేతది ముమ్మాటికీ అక్రమ అరెస్టే
- ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ కుట్రలు
- ఒంగోలులో ‘సాక్షి చైతన్యపథం’లో ప్రభుత్వ, సీబీఐ తీరుపై వక్తల ఆగ్రహం

సాక్షి, ఒంగోలు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదికిపైగా జైల్లో ఉంచడం ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కును హరించడమేనని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ ప్రముఖులు, వక్తలు, ప్రజలు అభిప్రాయపడ్డారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన సీబీఐ రాజ్యాంగ, ప్రాథమిక హక్కులకు సవాల్ విసురుతోందని దుయ్యబట్టారు. ‘సాక్షి చైతన్యపథం’ సదస్సును సోమవారం ఒంగోలులో నిర్వహించారు. ఇందులో ప్రసంగించిన పలువురు కాంగ్రెస్-టీడీపీల కుమ్మ క్కు రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.

క్విడ్ ప్రో కో ద్వారా జగన్ ఏం లబ్ధిపొందారో నేటి వరకు స్పష్టం చేయలేదు.. అంతే కాదు.. ఏ ఒక్క మంత్రీ కేబినెట్‌కు వ్యతిరేకంగా ఆ 26 జీవోలు జారీ చేసినట్లు చెప్పలేదు... అలాంటపుడు అసలు జగన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? ఇది ఓ వ్యక్తి నాయకుడిగా ఎదుగుతున్న తీరును చూసి ఓర్వలేక అణగదొక్కేందుకు జరిగిన కుట్రే .. అని వక్తలు పేర్కొన్నారు. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఇలాంటి దారుణం ఇదే ప్రథమమని ఎక్సైజు శాఖలో పదవీ విరమణ చేసిన అధికారి ఫజులుల్లా అన్నారు. తమ పార్టీలో ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడని, పార్టీని వీడినందునే ఆయన ఇన్ని కష్టాలు పడుతున్నాడని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ స్వయంగా వ్యాఖ్యానించటం కాంగ్రెస్ దుష్ట రాజకీయాలను స్పష్టం చేస్తోందన్నారు. రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలు బెయిల్‌ను తమకనుకూలంగా ఇష్టానుసారంగా వాడుకోవటం క్షమార్హం కాదని మాజీ డిప్యూటీ జాయింట్ కలెక్టర్ షంషేర్ అహ్మద్ అన్నారు. 

ప్రముఖ న్యాయవాది మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అరెస్టు తీరును తప్పు పట్టారు. సహజంగా నిర్ణీత సమయంలో(రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం 90 రోజుల్లో) దర్యాప్తు పూర్తి కాకుంటే కోర్టులే స్వయంగా జోక్యం చేసుకుని దర్యాప్తును పరిశీలించి, బెయిల్ మంజూరు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ కోటిరెడ్డి మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనే భావన 80 శాతం మందిలో లేదన్నారు. ఏ నేరం చేశారో చెప్పకుండా ఓ వ్యక్తిని 90 రోజులకుపైగా జైల్లో నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమనీ, వ్యక్తి స్వేచ్ఛను హరించడమేననీ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఓదార్పుయాత్ర చేపట్టిప్రజాదరణ పొందుతున్నందునే అరెస్టు చేసి, అనవసర ఆరోపణలు మోపుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పేదల మోముల్లో మళ్లీ సంతోషాలు వెల్లివిరియాలంటే జగన్ సీఎం కావాలి... ఆ శుభ ఘడియలు త్వరలోనే వస్తాయని ప్రముఖ రచయిత్రి, సామాజిక సేవకురాలు స్వరూపారాణి అన్నారు.
Share this article :

0 comments: