
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సొంత జిల్లాలోని తిరుపతి పట్టణ ఎమ్మెల్యే బూమన కరుణాకరరెడ్డి పంటికింద రాయిలా తయారైనట్లు కనిపిస్తుంది. రోజూ ఏదో ఒక ఆందోళన చేస్తూ ముఖ్యమంత్రికి వ్యతరేకంగా ప్రచారం చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం తిరుపతిని మద్య రహిత పట్టణంగా మార్చాలంటూ పెద్ద నిరసన నిర్వహించారు.మహిళలను సమీకరించి ప్రజల దృష్టిని ఆకర్షించారు.అలాగే తిరుపతి సమస్యలపై రకరకాలుగా దీక్షలు చేపడుతున్నారు.తాజాగా వృద్దులను సమీకరించి వారితో ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న వైఖరీకి నిరసనగా తిరుపతి-కరకంబాడి రహదారిపై వృద్ధులు శుక్రవారం బైటాయించి, నిర్వహించిన ధర్నా జరిపారు. అందుకు కరుణాకరరెడ్డి మద్దతు ప్రకటించారు. గతంలో వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కిరణ్ సర్కార్ తూట్లు పొడస్తున్నారనేందుకు వృద్ధుల ధర్నానే ఓ నిదర్శనమని భూమన ద్వజమెత్తారు.నాలుగు నెలలుగా పెన్షన్లు అందడం లేదని వృద్దులు వాపోయారు.వై.ఎస్.ఉన్నప్పుడు సజావుగా అందేవని చెప్పడం విశేషం.చిత్తూరు జిల్లా లో మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తోనే కిరణ్ తలనొప్పికి గురి అవుతుంటే, పెద్ద నగరంగా ఉన్న తిరుపతిలో రోజూ ఏదో ఒక నిరసన చేపట్టి కరుణాకరరెడ్డి ఆయనకు పంటి కింద రాయిలా మారారు. మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో జరిగిన ఉప ఎన్నికలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన కరుణాకరరెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన ఏదో ఒక ఆందోళన చేపడుతున్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20130707_1.php
0 comments:
Post a Comment