కాంగ్రెస్ వైఖరి నిరంకుశం, ఏకపక్షం: వైఎస్సార్సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ వైఖరి నిరంకుశం, ఏకపక్షం: వైఎస్సార్సీపీ

కాంగ్రెస్ వైఖరి నిరంకుశం, ఏకపక్షం: వైఎస్సార్సీపీ

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు నాలుగు పేజీల లేఖను వారు విడుదల చేశారు. అందరినీ సంప్రదించాలన్న మా విజ్ఞప్తి అరణ్య రోదనే అయ్యిందని, రాగల పరిణామాలకు కాంగ్రెస్సే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు అన్నారు.

ఒక తండ్రి తన పిల్లలకు పరిష్కారం చూపినట్లుగా ఈ రాష్ట్ర సమస్యకు కాంగ్రెస్ పార్టీ, కేంద్రం పరిష్కారం చూపించాలని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం సర్వాధికారాలు కేంద్రానివే అని కాంగ్రెస్ ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని పైనుంచి రెండు ముక్కలు చేసి ఒక్కో భాగం ఒక్కో రాష్ట్రం అనడం తగదని, అలాగైతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు నీళ్లు ఎక్కడున్నాయని వారు ప్రశ్నించారు. ఇలాంటి జటిల సమస్యలకు పరిష్కారం వెతకాలని, అంతేతప్ప తామే ప్రభుత్వం, పార్టీ అన్నట్లు నిర్ణయం తీసుకుంటారా అని నిలదీశారు.

ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా చూడాలని మాత్రమే తాము చెప్పామని, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో చెప్పినట్లు నిర్ణయం తీసుకోవాలన్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరి జీవితాలతో చెలగాటం ఆడుతోందని అన్నారు. ఇలాంటి సమయంలో స్సందించకుంటే చరిత్రహీనులుగా మిగలిపోతామని నాయకులు తెలిపారు. ముందు కేంద్రం ప్రతిపాదన ఏంటో చెప్పాలి గానీ, అలా చేయకుండా రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తున్నారని చెప్పారు. ఎవ్వరినీ పరిష్కారాలు అడకుండా ఓట్లు, సీట్లుకోసం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ విభజన అంశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని విమర్శించారు.
Share this article :

0 comments: