తమ నాయకుడిని బంధించడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తమ నాయకుడిని బంధించడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు...

తమ నాయకుడిని బంధించడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు...

Written By news on Sunday, July 28, 2013 | 7/28/2013

ఆనాడు భక్త రామదాసు శ్రీరాముడికి ఆలయం కట్టించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కోపగించిన తానీషా అతడిని బందిఖానాలో పడేసి, చిత్రహింసలు పెట్టాడు. రామదాసు బెదరలేదు. అదరలేదు. రామనామస్మరణ చేస్తూ అన్నిటినీ భరించాడు. చివరికి తానీషా తన తప్పు తెలుసుకుని రామదాసుకు నమస్కరించాడు. రామదాసు శ్రీరాముడి గుండెలో నిలిచిపోయాడు. 

నేడు జగన్ ప్రజాసంక్షేమం కోసం ఓదార్పుయాత్ర చేస్తుంటే, దీక్షలు చేపడుతుంటే కాంగ్రెస్ అధిష్టానం అతడిని జైల్లో పడదోయించింది. బయటికి రాకుండా అడ్డుకుంటోంది. తమ నాయకుడిని అలా బంధించడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. జగన్ కూడా తన ప్రజల కోసం ఎంతో సహనంగా బాధలు భరిస్తున్నారు. త్వరలోనే ఆయనకు న్యాయం జరుగుతుంది. అప్పుడు ఈ పాలక, ప్రతిపక్షాల నాయకులు జగన్‌కు నమస్కరించే రోజు వస్తుంది. జగనన్న నిర్మించే రాజన్న రాజ్యంలో ఇంత చోటిమ్మని ఈ వైరివర్గాలు బతిమాలే సందర్భం కూడా వస్తుంది.
- అన్నారం వెంకటేష్, దపోల్లి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర

జగనన్న ముఖ్యమంత్రి కావాలికాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోవాలి

ప్రతి మనిషి గుండె లబ్‌డబ్ లబ్‌డబ్ మని కొట్టుకుంటుంది. కానీ కాంగ్రెస్ నాయకుల గుండె జగన్... జగన్ అని కొట్టుకుంటున్నట్లుంది! మేము కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉంటాము. ఇక్కడి ప్రవాసాంధ్రులను తరచు ప్రశ్నిస్తూ ఉంటాము... ఆంధ్ర రాజకీయాలు ఎలాగున్నాయీ అని. ఒక రోజు మేము ఎలహంక వెళ్లాము. అక్కడ చేనేత కార్మికులు తొంభై శాతం వరకు ఉన్నారు. వారందరికీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారంటే అమితమైన అభిమానం. ఒక్కొక్కరినీ కదిలిస్తుంటే కన్నీరుమున్నీరయ్యారు. జగన్‌ని కాంగ్రెస్ నాయకులు వేధిస్తున్న తీరు గురించి తెలుసుకుని ఆవేశానికి లోనయ్యారు. జగనన్న ముఖ్యమంత్రి కావాలని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలను అడ్డుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. 

- గిరిధర్ (దినసరి కూలీ), శ్రీనివాస్ (చేనేత కార్మికుడు), బెంగళూరు
Share this article :

0 comments: