రాబందుల రాజ్యమిది : కిరణ్ ప్రభుత్వంపై షర్మిల నిప్పులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాబందుల రాజ్యమిది : కిరణ్ ప్రభుత్వంపై షర్మిల నిప్పులు

రాబందుల రాజ్యమిది : కిరణ్ ప్రభుత్వంపై షర్మిల నిప్పులు

Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013

- ఈ దారుణ పాలనలో సామాన్యుడికి ఇల్లు గడవడమే కష్టమైపోతోంది
- ఏది చూసినా ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మహిళలంటున్నారు
- మద్దతు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు
- కరెంటు లేక పంటకు నీరు కూడా పెట్టలేకున్నారు
- ధరలు భరించలేక ఎరువులూ వేయడం లేదు
- ఆరోగ్యశ్రీ, 108, 104.. ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు
- ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు చప్పట్లు కొడుతున్నారు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతులకు ఎరువుల ధరలు, విత్తనాల ధరలు అన్ని ధరలూ పెరిగిపోయాయి. మద్దతు ధర మాత్రం ఏ పంటకూ పెరగటం లేదు. మహిళలను పలకరిస్తే ‘మూడు పూటలా ఇళ్లు గడవటం కష్టమైపోయిందమ్మా.. ఉప్పు, పప్పు, నూనె, కారం, చక్కెర, చింతపండు ఏది తీసుకున్నా ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయమ్మా’ అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాబందులు రాజ్యం ఏలుతుంటే గుంట నక్కలు తాళం వేశాయన్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంత దారుణంగా పరిపాలన చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు పక్కనే నిలబడి చప్పట్లు కొడుతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కయిన చ ంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో సాగింది. ఈ నియోజకవర్గంలోని కే కోటపాడు మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

పాలకులా? రాక్షసులా?
‘‘అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో రైతులకు బ్రహ్మాండంగా మద్దతు ధర ఇస్తున్నారు. మన దేశంలోనే, అందునా మన రాష్ట్రంలోనే రైతులంటే చిన్నచూపు చూస్తున్న వీళ్లు పాలకులా? లేక రాక్షసులా? సంక్షేమ పథకాలవైపు చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు కావడం లేదు. ఈ కిరణ్ సర్కారులో ఆరోగ్య శ్రీకి జబ్బు చేసింది. 108, 104 కనుమరుగైపోతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంటు కుంటుపడుతోంది. ‘అన్ని నిత్యావసర సరుకుల ధరలూ పెరిగిపోతుంటే పెన్షన్ డబ్బులు పెంచాల్సింది పోయి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన పెన్షన్లు కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు తల్లీ’ అని వాళ్లు చెప్తుంటే చాలా బాధనిపిస్తోంది. పక్కా ఇళ్ల పథకానికి పాడె కట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అటకెక్కించారు.

కరెంటు కోతతో పరిశ్రమల మూత..
వైఎస్సార్ బతికే ఉంటే ఈ రోజు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు అందేది. ఇప్పుడు తొమ్మిది గంటలు కాదు కదా! కనీసం 3 గంటలు కూడా రావడం లేదు తల్లీ అని రైతులు చెప్తున్నారు. నిన్న గోవాడలో రైతులు చెరకు గెడలు పట్టుకొచ్చి చూపించారు. ‘కరెంటు సరఫరా సరిగా లేక, ధరలు పెరగడంతో ఎరువులను కొని వేయలేక చెరకు గెడలు సరిగా ఎదగలేదమ్మా’ అని చెప్పి బాధపడ్డారు. పరిశ్రమలకు నెలకు 12 రోజుల పవర్ కట్. దీంతో ఇప్పటికే మన రాష్ట్రంలో వేల కొద్దీ పరిశ్రమలు మూతపడ్డాయి. 20 లక్షల మందికి పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. గ్రామాల్లో.. ఎవరిని అడిగినా ‘నాలుగు గంటలు.. మహా అయితే 7 గంటలకు మించి ఎక్కడా కరెంటు లేదు.

కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. కానీ లేని కరెంటుకు ఈ కిరణ్ సర్కారు మూడింతల బిల్లు మాత్రం వసూలు చేస్తోంది’ అని అంటున్నారు. కరెంటు ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అమానుషం అన్న విషయం మన కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్థం చేసుకునేంత ఇంగితం లేదో.. లేక అంత పెద్ద మనసు లేదో అర్థం కావడం లేదు. ఇంత అన్యాయమైన పరిపాలనకు నిరసనగా, ఈ కరెంటు చార్జీల మోతకు నిరసనగా అన్ని ప్రతిపక్షపార్టీలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఈ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలటానికి వీలు లేదని విప్ జారీ చేసి మరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు.

ఈ పాపం ఊరికే పోదు..
ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే పాపం ఆయన పార్టీ నుంచే ఆయన్ను ఈ చంద్రబాబు గెంటివేశారు. ఈ చర్యతో ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురై మరణించారు. ఈ పాపం ఊరికే పోదు. ఇంతకింత అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మరీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏం చేశాడని చూస్తే.. వ్యవసాయం దండగ అని అన్నారు. ప్రాజెక్టు కడితే నష్టం వస్తుందన్నారు. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని అన్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని చెప్పారు. చంద్రబాబు హయాంలో విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్ షిప్‌లు ఇవ్వండి ముఖ్యమంత్రీ అంటే వాళ్లను లాఠీలతో కొట్టించారు. జీతాలు పెంచండి అని అడిగితే అంగన్‌వాడీ కార్యకర్తలను మహిళలు అని కూడా చూడకుండా గుర్రాలతో తొక్కించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది పేదవాళ్లని తెలిసి కూడా వాళ్ల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసిన దుర్మార్గుడు ఈ చంద్రబాబు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గ్రామాలను వల్లకాడుగా మార్చి, రైతులను పొట్టన పెట్టుకున్నారు. ప్రపంచ బ్యాంకుతో ప్రతి ఏటా కరెంటు చార్జీలు పెంచుతానని చెప్పి ఒప్పందాలు చేసుకున్న దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.’’

13.5 కిలోమీటర్ల మేర యాత్ర..
సోమవారం 196వ రోజు ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గొండుపాలెం నుంచి ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి బత్తివానిపాలెం మీదుగా కే కోటపాడు గ్రామం చేరుకున్నారు. ఇక్కడకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి జోగన్నపాలెం, కింతాడ, కే సంతపాలెం, చంద్రయ్యపేట మీదుగా యాత్ర చేశారు. సూదివలస జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13.5 కిలోమీటర్లు నడిచారు. 

ఇప్పటి వరకు మొత్తం 2,606.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో తాజా మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు, జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్లబాబూరావు, మాడుగుల సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, చెంగల వెంకట్రావు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పెట్ల ఉమాశంకర్ గణేష్, కిడారి సర్వేశ్వర్‌రావు, ప్రగడ నాగేశ్వర్‌రావు, బొడ్డేటి ప్రసాద్, యూత్ నాయకుడు అన్నంరెడ్డి అదీప్‌రాజు, స్థానిక నాయకులు దాడి రత్నాకర్, కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.
Share this article :

0 comments: