‘శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత కాదు’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత కాదు’

‘శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత కాదు’

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013

రాజమండ్రి ఏటీఎం నగదు నిర్వాహకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత కాదని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. కొన్ని ఛానళ్లు పనిగట్టుకుని తనపై దుష్ర్పచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ద్వారంపూడి మంగళవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. శ్రీధర్‌రెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని స్థానికులు చెప్పారని, నాలుగు నెలల క్రితం అతను చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తాను హాజరయ్యానని ద్వారంపూడి తెలిపారు.

పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారని, వారి భవిష్యత్తులో ఎలా ఉంటారో తెలియదన్నారు. శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో ఓ కార్యకర్తగానే పని చేశాడని, పార్టీ నేత ఎంత మాత్రం కాదని ఆయన వివరణ ఇచ్చారు. కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని ఈ ఘటనపై పోలీసులు చెప్పింది ఒకటైతే, కొన్ని మీడియా చానెళ్లు మరో రకంగా వక్రీకరిస్తున్నాయన్నారు. దీనిపై అవసమైతే న్యాయపరంగా పోరాడతానని ద్వారంపూడి తెలిపారు.
Share this article :

0 comments: