రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ

రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013

రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. రాబోయే పంచాయతీ ఎన్నిలు పార్టీ ప్రాతిపదికన జరిగేవి కావని లేఖలో ప్రస్తావించారు. ఈ ఎన్నికలు సంక్షేమాన్ని కోరుకునే శక్తులకు, వ్యతిరేకించే శక్తులకు మధ్యేనని ఆమె తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పాలనలో సువర్ణయుగం నడిచిందని, అంతకు ముందు ఆ తర్వాత కూడా శూన్యయుగాన్ని చూస్తున్నామన్నారు. 

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి నిరోధక పార్టీలని, పన్నులు పెంచి ప్రజలను అగచాట్లకు గురిచేయడమే వారి లక్ష్యమని విజయమ్మ విమర్శించారు. విశ్వసనీయత, వంచన మధ్య జరుగుతున్న ఎన్నికలగా ప్రజలు గుర్తించాలన్నారు. ఈ ఎన్నికలు వైఎస్సార్ సువర్ణయుగ స్థాపనకు ముందడుగా భావించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ శ్రేణులన్నీ సమరశంఖం పూరించాలని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు. 

Share this article :

0 comments: