'జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకే.. సీమ విభజన' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకే.. సీమ విభజన'

'జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకే.. సీమ విభజన'

Written By news on Wednesday, July 3, 2013 | 7/03/2013

రాయలసీమపై కక్ష కట్టిన కాంగ్రెస్ 
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధిష్టానం రాయలసీమపై కక్ష కట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత శోభానాగిరెడ్డి అన్నారు. మంగళవారమిక్కడ తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో రాజధానిగా కర్నూలును, బళ్లారిలను సీమ ప్రజల నుండి అప్పటి కాంగ్రెస్ పెద్దలు వేరుచేశారన్నారు. ప్రస్తుతం అదే కాంగ్రెస్ నాయకులు సీమలోని నాలుగు జిల్లాలను రెండుగా విడదీసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. ‘సీమలో నాలుగు జిల్లాలు కలిసి ఉన్నప్పుడే నీళ్లు, నిధుల విడుదల విషయంలో తీరని అన్యాయం జరుగుతోంది. ఇక విడగొడితే సీమ ప్రజలు మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్నా ఇక్కడి కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం బాధాకరం. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకే కాంగ్రెస్ పెద్దలు సీమను విడగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

ఎన్నికల్లో ఈ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుందనే భయంతోనే కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు విభజనపై స్పందించడం లేదు. ఇప్పటికైనా నేతలంతా కలిసి విభజనను వ్యతిరేకించేందుకు సంసిద్ధులు కావాలి’ అని కోరారు. పార్టీల లాభనష్టాలను పక్కనపెట్టి.. విభజన ప్రతిపాదనను అడ్డుకోకపోతే భావితరాలు క్షమించవన్నారు. ‘అధికార దర్పంతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాంగ్రెస్‌కు తగదు. తెలంగాణ సమస్యను పరిష్కరించమని కోరితే.. రాయలసీమ విభజన ప్రతిపాదనతో కాంగ్రెస్ అధిష్టానం కొత్త సమస్యను సృష్టిస్తోంది’ అని పేర్కొన్నారు.
Share this article :

0 comments: