జగన్ విడుదలైతేనే... పేద ప్రజల జీవితాలకో భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ విడుదలైతేనే... పేద ప్రజల జీవితాలకో భరోసా

జగన్ విడుదలైతేనే... పేద ప్రజల జీవితాలకో భరోసా

Written By news on Monday, July 15, 2013 | 7/15/2013

రాష్ట్రంలోనే కాదు, యావద్దేశంలోనే ఒక నాయకుడికి ప్రజలు ఇంతలా బ్రహ్మరథం పట్టలేదు. జగన్ అంటే ప్రజల గుండెల్లో ఉన్న అభిమానమే ఇందుకు కారణం. అందుకే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆయన విడుదలవ్వాలని కోరుకుంటోంది. దివంగతనేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ పార్టీ వ్యక్తులు అయినా సరే, ప్రతిపక్షంలో ఉన్నవారైనా సరే, చీటికిమాటికి ఉద్యమాల పేరుతో ఇప్పుడు ప్రజల్ని ఇబ్బందిపెడుతున్న వారైనా సరే ఏనాడూ ఆయన ముందు నోరెత్తలేదు. ఆనాడు ప్రతి ఒక్కరు కూడా వై.ఎస్.సన్నిహితుడిని అని చెప్పుకోడానికి పోటీపడ్డారు.

ఆయన ప్రతిష్టతో పైకొచ్చారు. కానీ ఆయన మరణించిన వెంటనే వీరంతా మారిపోయారు. తలలు ఎగరేశారు. తోకలు ఆడించారు. ఆయన తనయుడిని జైలుపాలు చేశారు. ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తాన్నీ వేధిస్తున్నారు. ఏ నాయకుడైనా తరాలు తిన్నా తరగని డబ్బును సంపాదించుకెళ్లడం చూశాం. వై.ఎస్.గారు మాత్రం ఏ సంపదకూ తూగని ప్రజాభిమానాన్ని పోగేసుకుని వెళ్లిపోయారు. ప్రజలకు ఆయన చేసిన సేవలే ఇప్పుడు ఆ కుటుంబానికి శ్రీరామరక్ష. జగన్ విడుదలైతేనే ప్రజల జీవితాలకో భరోసా. రాజన్న మీద, జగనన్న మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఎవరూ పోగొట్టలేరు. ఆ వాస్తవాన్ని గ్రహించాయి కాబట్టే పాలక, ప్రతిపక్షాలు జగన్‌ను నిర్బంధించి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయం చూసి బుద్ధి చెబుతారు. జగన్‌ని అందలం ఎక్కిస్తారు.

- పోల విజయకుమార్, సదాశివపేట, మెదక్ జిల్లా

జగన్‌కు జరిగిన అన్యాయానికి... ప్రజలే బదులు తీర్చుకుంటారు

వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి గారి అధ్యక్షతన వై.ఎస్.ఆర్.సి.పి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత బలమైన రాజకీయశక్తిగా శరవేగంతో ఎదుగుతున్నట్లు ఉప ఎన్నికల ఫలితాలు ఏనాడో స్పష్టం చేశాయి. జగన్‌ని జైల్లో ఉంచి నిర్బంధించినా, ఆ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జగన్‌కి ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆయన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇక లాభం లేదని అరెస్టు ద్వారా ఆయన్ని నిరోధించాయి. ప్రజాసమస్యలను గాలికి వదిలి జగన్‌పైనే తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి, ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం, కేంద్రం, సీబీఐ అన్నీ కలిసి జగన్‌నీ, ఆయన కుటుంబాన్నీ ఎంతగా వేధిస్తున్నాయో చూస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఇక ఎంతో కాలం సహించరు. రాజన్న తనయుడు జగనన్నని తమ నాయకుడిగా ఎన్నుకోవడం ద్వారా ఆయన ప్రత్యర్థులకు కనువిప్పు కలిగిస్తారు.

- పోతిన బాబూరావు, పిళ్లాకనకయ్య వీధి, విజయవాడ
Share this article :

0 comments: