సీబీఐది ముమ్మాటికీ వక్రమార్గమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐది ముమ్మాటికీ వక్రమార్గమే

సీబీఐది ముమ్మాటికీ వక్రమార్గమే

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013

- న్యాయస్థానాన్నీ తప్పుదోవ పట్టిస్తోంది
- జగన్ విజయుడై వస్తాడు... జనం ఆశలు తీరుస్తాడు
- నరసరావుపేటలో జరిగిన సాక్షి ‘చైతన్యపథం’లో నినదించిన విద్యార్థులు, మేధావులు

సాక్షి, గుంటూరు: ప్రజల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న కరిజ్మాతో కాంగ్రెస్, టీడీపీల మనుగడ ప్రశ్నార్థకమవుతోందని, అందుకే ఆ పార్టీ నేతలు సీబీఐని అడ్డుపెట్టుకుని జననేతను జైల్లో ఉంచేందుకు కుమ్మక్కు కుట్రలు చేస్తున్నారని విద్యార్థులు, మేధావులు గళమెత్తారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని, ఆక్షేపణీయమని ముక్త కంఠంతో ఖండించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర కల్యాణమంటపంలో నాగరాజు వ్యాఖ్యానంతో సాక్షి చైతన్యపథం సదస్సు సోమవారం జరిగింది. న్యాయవాది రామ్మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు కలిసి హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ సాగిస్తున్న సీబీఐ న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.

క్విడ్‌ప్రోకో కేసును ఎల్లోమీడియా వక్రీకరించి అక్రమ ఆస్తుల కేసంటూ గంగవైలెత్తుతోందని నిందించారు. అధ్యాపకుడు రాజారెడ్డి మాట్లాడుతూ 26 జీవోల జారీలో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లకు ప్రమేయమున్నా, ఏ సంబంధం లేని జగన్‌ను ఇరికించడంపై సామాన్యుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నారు. జగన్‌పై ఎన్ని విష కీటకాలు విషం చిమ్మినా విజయుడై వస్తాడని, జనం ఆశలు తీరుస్తాడని ఉద్ఘాటించారు. రిటైర్డ్ లెక్చరర్ సుభానీ మాట్లాడుతూ సీబీఐ పూర్తిగా కాంగ్రెస్ జేబు సంస్థలా మారిందని ధ్వజమెత్తారు. పెన్షనర్ సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ పాపులారిటీ తగ్గించేందుకు వ్యూహాత్మకంగా కుట్ర జరుగుతోందని, ఎల్లో మీడియాను వాడుకుని జగన్ వ్యక్తిత్వం దెబ్బతీసేందుకు ప్రయత్నించడం హేయమన్నారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గంధం లోక్‌నాథశర్మ మాట్లాడుతూ జగన్‌పై కుట్ర ఢిల్లీ కేంద్రంగా జరిగిందని, ముఖ్యమంత్రి రోశయ్యగా ఉన్న సమయంలోనే జగన్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు.

అయితే రోశయ్య తన వల్ల కాదని తేల్చి చెప్పడం, కిరణ్ కుమార్ రెడ్డి తాను చేస్తానని చెప్పి సీఎం కుర్చీలో కూర్చున్నారని చెప్పారు. గృహిణి అంజని మాట్లాడుతూ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్ కుమారుడికే న్యాయం జరగనప్పుడు తమలాంటి సాధారణ వ్యక్తుల పరిస్థితేంటనేది తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. సదస్సుకు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు, విద్యార్థులు హాజరయ్యారు.

      
Share this article :

0 comments: