ఓటుతో ఆ పార్టీలకు బుద్ది చెప్పండి:వైఎస్ఆర్ సిపి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఓటుతో ఆ పార్టీలకు బుద్ది చెప్పండి:వైఎస్ఆర్ సిపి

ఓటుతో ఆ పార్టీలకు బుద్ది చెప్పండి:వైఎస్ఆర్ సిపి

Written By news on Saturday, July 13, 2013 | 7/13/2013

ఓటు ద్వారా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ది చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రజలకు పిలుపు ఇచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సుచరిత, బాలరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్న తెలుగుతమ్ముళ్ళు కాంగ్రెస్‌తో సయోధ్య కుదుర్చుకుంటున్నారన్నారు. 

టీడీపీ, కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. పంచాయితీ ఎన్నికల్లో ఒప్పందాలు కుదుర్చుకుని మాకది-మీకిది అనే పద్దతిలో ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలపై రాష్ట్రప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓటు ద్వారా ఆ రెండు పార్టీలకు తగిన రీతిలో బుద్దిచెప్పాలన్నారు. 
Share this article :

0 comments: