రాజన్నని అభిమానించే ప్రతి గుండె ఎప్పటికీ జగనన్న వెంటే ఉంటుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్నని అభిమానించే ప్రతి గుండె ఎప్పటికీ జగనన్న వెంటే ఉంటుంది

రాజన్నని అభిమానించే ప్రతి గుండె ఎప్పటికీ జగనన్న వెంటే ఉంటుంది

Written By news on Wednesday, July 10, 2013 | 7/10/2013

ఈ రోజున రాజన్న బతికి వచ్చి ఎదురుగా నిలబడితే ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు నేరుగా ఆయన కళ్లలోకి చూసి మాట్లాడగలరా? ఈ ప్రశ్నకు వాళ్లేమీ సమాధానం చెప్పనవసరం లేదు. వారికి వారు చెప్పుకుంటే చాలు. ఆయన్ని, ఆయన తనయుడు జగన్‌ని ఎన్ని మాటలన్నారు! ఎంత పాపం మూటకట్టుకున్నారు! కౌంట్‌డౌన్ మొదలైంది కదా! ఇంతకింతా అనుభవిస్తారు. ప్రజాతీర్పులో కొట్టుకునిపోతారు. రాజన్నని అభిమానించే ప్రతి గుండె జగనన్న వెంటే ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించింది పెద్దాయన్ని చూసి కానీ, సోనియాని చూసి కాదు. పెద్దాయన అమలుచేసిన పథకాలను చూసి కానీ, కాంగ్రెస్ పథకాలను చూసి కాదు. అందుకే ప్రతి పేదవాడి గుండె చప్పుడు రాజన్నే. ఆ రాజన్న తనయుడు జగనన్నకే ఎప్పటికీ ప్రజాదరణ.

- విజయకుమార్, బొబ్బిలి, విజయనగరం

జగన్‌ని జైల్లో ఉంచినంత మాత్రాన...
జనం నుండి దూరం చేయగలరా?!
మన రాష్ట్రంలో ఉన్న నాయకులలో జగనన్న ఒక్కడే నిజమైన ప్రజానాయకుడు. అలాంటి నాయకుడు జనం మధ్యలో ఉండాలే కానీ, జైల్లో కాదు. జగనన్నను వీళ్లు కొంతకాలం జైల్లో ఉంచగలరేమో కానీ, జనం గుండెల నుంచి ఒక్కరోజైనా దూరం చేయలేరు. ప్రజల్లో వ్యతిరేకభావం కలిగించడానికి కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎల్లో మీడియా తన వంతు అబద్ధాలను ప్రచారం చేస్తోంది. వీటిని ప్రజలు నమ్మరు. జగనన్న త్వరలోనే ప్రజల్లోకి వస్తారు. అప్పుడు ఈ దుష్టకూటములే ప్రజలకు దూరం అవుతాయి. ఇది నిజం.
- అమ్ములూరి మరియదాసు, ఇ-మెయిల్

ఈ నాయకుల్ని తొక్కుకుంటూ వెళ్లి
ప్రజలు జగన్‌తో కరచాలనం చేస్తారు!
విచారణ కోసం అలా ఒకసారి బయటికి వస్తేనే జగనన్న కోసం ఇంతమంది అభిమానులు తోసుకుంటుంటే వారిని కట్టడి చెయ్యలేక పోలీసు యంత్రాంగం ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది కదా! రేపు జగనన్న బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్‌పార్టీ ఈ పోలీసుల చేత ఇంకెంత హడావుడి చేయిస్తుందో, కాంగ్రెస్ నాయకులకు ఎంతగా చెమటలు పడతాయో!! చిన్నవయసులో అశేష ప్రజల అభిమానాన్ని చూరగొన్న జగనన్న బైటికి వస్తే అప్పుడిక ప్రజల ఆనందోద్వేగాల హృదయ స్పందనలు తప్ప వేరే ఏమీ వినిపించవు. కారుకూతలు కూసిన ఈ నాయకుల మీది నుంచి, వారిని తొక్కుకుం
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=65331&Categoryid=11&subcatid=21#sthash.ptUy5EZg.dpuf
Share this article :

0 comments: