సిక్కోలులో రేపటి నుంచి.. మరో ప్రజాప్రస్థానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిక్కోలులో రేపటి నుంచి.. మరో ప్రజాప్రస్థానం

సిక్కోలులో రేపటి నుంచి.. మరో ప్రజాప్రస్థానం

Written By news on Saturday, July 20, 2013 | 7/20/2013

*** వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద జిల్లాలోకి ప్రవేశం
*** ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్న షర్మిల పాదయాత్ర
*** యాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా ప్రజలు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 21న(ఆదివారం) జిల్లా లో ప్రారంభం కానుంది. తండ్రి దివంగత మహానేత వై.ఎస్. అడుగుజాడల్లో.. సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు ఆయన సోదరి షర్మిల చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర చివరి మజిలీ అయిన శ్రీకాకుళం జిల్లాలో ఆ రోజు నుంచి కొనసాగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష ఉపనేత ధర్మాన కృష్ణదాస్, ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్ర పార్వతీపురం నియోజకవర్గం మీదుగా ఆదివారం మధ్యాహ్నం వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామం వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుందని వారు పేర్కొన్నారు.

ఇచ్ఛాపురం వరకు కొనసాగే మరో ప్రజాప్రస్థానాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు సహకరించాలని కోరారు. వైఎస్‌కు, ఆయన కుటుంబానికి జిల్లా ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందేనని, అందుకనే వైఎస్‌ఆర్‌సీపీకి జిల్లాలో ఇంతటి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ తనయ షర్మిల తలపెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగియడం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా షర్మిలకు వివరించవచ్చునన్నారు.

జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చిన తమ పార్టీ అండగా ఉంటోందని, షర్మిల యాత్ర ఉద్దేశం కూడా అదే అయినందున ప్రజలు ఈ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె దృష్టికి తేవాలని సూచిం చారు. గతంలో వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అవన్నీ ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయన్నారు. ఇలాంటి సమస్యలు తెలుసుకునేందుకే అలుపెరుగకుండా పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిలను మరింత ప్రోత్సహించేం దుకు పార్టీ సమన్వయకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, యువజన, విద్యార్థి విభాగాలు, పార్టీలోని ఇతర అన్ని విభాగాల ముఖ్యులు తరలిరావాలని, జిల్లాలోకి ప్రవేశించే సమయంలో ఆమె ఘన స్వాగతం పలకాలని వారు విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: