‘పంచాయతీ’ల్లోనూ కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘పంచాయతీ’ల్లోనూ కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు

‘పంచాయతీ’ల్లోనూ కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు

Written By news on Sunday, July 14, 2013 | 7/14/2013

వైఎస్సార్‌సీపీని దెబ్బతీయాలన్న కుట్రతో ఒక్కటయ్యాయి: వైఎస్సార్‌సీఎల్పీ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ నేతలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలతో సయోధ్య కుదురుకుని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ధ్వజమెత్తింది. అసెంబ్లీలో అవిశ్వాసం సందర్భంగా విప్ జారీ చేసి ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడినట్లుగానే... గ్రామాల్లో టీడీపీ నేతలు కాంగ్రెస్ వారితో చేతులు కలిపి ‘మాకిది-మీకది’ పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత మేకతోటి సుచరిత, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి టి.బాలరాజులు శనివారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రు లు, టీడీపీ అగ్రనాయకుల కనుసన్నల్లోనే కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు. పీలేరులో సీఎం కిరణ్ సోదరుడు అక్రమాలకు పాల్పడుతున్నా.. టీడీపీ నేతలు నోరు మెదపకపోవడం వారి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనాలివిగో..
‘‘విశాఖ జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో టీడీపీ-కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అనకాపల్లి మండలం గోపాలపురం పంచాయతీలో కాంగ్రెస్, టీడీపీలు ఒకే అభ్యర్థిని నిలుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వీరవరం గ్రామంలో రాష్ట్ర మంత్రి తోట నర్సింహం సతీమణి పోటీచేస్తున్నారు. అక్కడ టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురం గ్రామంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఏకమయ్యారు. దీనికి నేతృత్వం వహిస్తున్నది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఉల్లంపర్రు, కాజాతూర్పు, ఏనుగువానిలంక తదితర గ్రామాల్లో టీడీపీ వారితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. దీనికి నేతృత్వం వహిస్తున్నది స్థానిక ఎమ్మెల్యే ఉషారాణి. రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకటయ్యను బలవంతంగా టీడీపీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం తీసుకుపోయి తమ పార్టీ కండువా కప్పారు’’ అని వారు వివరించారు. టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: