వైఎస్ ప్రజాప్రస్థానమే నాకు స్పూర్తి: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ప్రజాప్రస్థానమే నాకు స్పూర్తి: షర్మిల

వైఎస్ ప్రజాప్రస్థానమే నాకు స్పూర్తి: షర్మిల

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర తనకు స్పూర్తి అని ఆయన తనయ షర్మిల సోమవారం వెల్లడించారు. ఆమె చేపట్టిన పాదయాత్ర సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని ధనపురం చేరుకుంది. దాంతో షర్మిల చేపట్టిన పాదయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ఆ మహానేత చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆయన సీఎం అయ్యాక అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రారంభించారన్నారు. 

ప్రతిపేదవాడు చదువుకోవాలని, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని రాజన్న తపించారని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూ. 1200 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ, రూ.1300 కోట్ల వడ్డీ మాఫీ, 12000 కోట్ల రుణాల మాఫీ చేసిన ఘనత వైఎస్ సొంతమని ఆమె తెలిపారు. పేదరికం పోవడానికి శాశ్వత పరిష్కారం చదువు, అందుకోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా లక్షలాది విద్యార్థులకు మేలు చేశారని ఆమె చెప్పారు. సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలో 16 లక్షలు ఫించన్లు మంజూరు చేస్తే వైఎస్‌ఆర్ హయాంలో 71 లక్షల ఫించన్లు ఇచ్చారని ప్రజలకు గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 41 లక్షల ఇళ్లు నిర్మిస్తే, ఒక్క మనరాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు నిర్మించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదని ఆమె వెల్లడించారు. 

గతంలో వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధి కట్టిందని ఆమె ఆరోపించారు. ఈ ప్రభుత్వ హయాంలో వేలాది పరిశ్రమలు మూతపడితే లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుత సీఎం కిరణ్ ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. గతంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఆర్టీసీ, కరెంట్ ఛార్జీల నుంచి పేదలకు విముక్తి లభించేదని షర్మిల అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ బయట ఉంటే తమ ఆటలు సాగవని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భావించాయని, అందుకే ఆయనపై కుట్ర చేసి జైలు పాలు చేశారని ఆమె పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న కేసులపై దర్యాప్తు చేయిస్తే ఆయన జైలుకెళ్లడం ఖాయమని షర్మిల ఈ సందర్బంగా పేర్కొన్నారు. అందుకే చంద్రబాబు చీకట్లో చిదంబరంతో ఒప్పందం చేసుకున్నారని షర్మిల ఎద్దేవా చేశా - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=643549&Categoryid=14&subcatid=0#sthash.8WFJh6CN.dpuf
Share this article :

0 comments: