ప్రజలమధ్యఉండాల్సిననాయకుడిని...ఎన్నాళ్లిలా దూరంగా ఉంచుతారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలమధ్యఉండాల్సిననాయకుడిని...ఎన్నాళ్లిలా దూరంగా ఉంచుతారు?

ప్రజలమధ్యఉండాల్సిననాయకుడిని...ఎన్నాళ్లిలా దూరంగా ఉంచుతారు?

Written By news on Tuesday, July 16, 2013 | 7/16/2013

ఒకప్పుడు నాకు సందేహంగా ఉండేది. ఒక మనిషిని ఇంతగా ప్రేమిస్తారా? ఒకవేళ ప్రేమించినా, ప్రాణం తీసుకునేంత పిచ్చి ప్రేమ ఉంటుందా? అని! నా సందేహానికి సమాధానం నా ఆప్తమిత్రుడు మరణించినప్పుడు దొరికింది. వాడు చనిపోయింది ఎవరికోసమో కాదు, దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు ఇక మనకు లేరని తెలిసి! నా ఫ్రెండ్ ఒక్కడే కాదు, వాడిలాంటి అభిమానులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను ఓదార్చడానికి జగనన్న వారి ఇళ్లకు వెళ్లారు. ఓదార్చారు. ఓదార్పు ఇంకా సాగుతుండగానే ఆయనను అరెస్ట్ చేశారు. ప్రజల మధ్య ఉన్న నాయకుడని ప్రజలకు దూరంగా తీసుకెళ్లారు. బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.

వారి భయం ఒక్కటే. జగన్ బయటికి వస్తే సరాసరి మళ్లీ ప్రజల దగ్గరికే వెళ్తాడు. అప్పుడు తమ గతి ఏమిటి? తమను ఎవరు పట్టించుకుంటారు... అని ఈ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులకు భయం పట్టుకుంది. జగనన్నను నిర్బంధానికి గురిచేసి సంతోషిస్తున్న ఓ గల్లీ నాయకులారా... మరణించిన నా మిత్రుడి సాక్షిగా, ఆప్తులను కోల్పోయిన కుటుంబాల సాక్షిగా, అన్నదాత కడుపుమంట సాక్షిగా, విద్యార్థుల ఇక్కట్ల సాక్షిగా, జగన్‌పై, ఆయన కుటుంబంపై దుష్ర్పచారాలను చేస్తూ చంద్రబాబు కొమ్ముకాస్తున్న కొన్ని పత్రికల ప్రజావ్యతిరేక ధోరణికి నిరసనగా... నేను, నా రాష్ట్రం, యావత్ ప్రజానీకం చెబుతున్నది ఒక్కటే, జగనన్న ఒంటరివాడు కాదు, అందరివాడు. ఇవాళో రేపో జగనన్న బయటికి వస్తారు. ప్రజలు ఆయన్ని అక్కున చేర్చుకుంటారు. మీకు తగినబుద్ధి చెబుతారు.

- బెల్లంకొండ సుబ్బు, తంగెడ, గుంటూరు జిల్లా

తెలుగుజాతి సమస్తం...తపిస్తోంది జగనన్న స్పర్శ కోసం

ప్రజా తిరుగుబాటు రాబోతున్నది ప్రళయంలా విరుచుకుపడడానికి,
రాష్ట్రం మునుపెన్నడూ చూడని మహావిప్లవంలా ముంచెత్తడానికి.
తుదిశ్వాస వరకు పేదవాడి బాగు కోసమే తపనపడ్డ మారాజును వంచిత విధి తీసుకెళ్లింది ప్రజలకు మిగిల్చి కష్టాలను, కడగండ్లను.
అయినా, ప్రతి పేద గుండె... మౌనంగా రోదిస్తున్నా...
ఏనాడూ అధైర్య పడలేదు... ఉన్నాడు కదా అని జగనన్న!
రాజన్న పోయాక పచ్చని చేనుకు చీడ పట్టింది.
వెలుగు నింపాల్సిన ‘చేతులే’ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశాయి.
కుటిల రాజకీయం పేదల దీపాన్ని,
నాలుగ్గోడల మధ్య బంధించింది.
సూర్యుణ్ని దోసిట్లో బంధించాలనుకోవడం ఒట్టి భ్రమే కదా!
బంధించడానికి, దాచెయ్యడానికి జగన్ లీడర్ మాత్రమే కాదు.
ప్రతి పేదవాడి ఆకలి, దప్పిక, కన్నీరు తుడిచే ఓదార్పు.
అందుకే తెలుగుజాతి సమస్తం తపిస్తోంది జగనన్న స్పర్శ కోసం.
యువకులు, వృద్ధులు, తెలుగింటి ఆడపడుచులు, శ్రామిక వర్గాలు...
ఏకమై, ఒక కూటమియై కదులుతున్నారు...
నీచ రాజకీయాల దహనసంస్కారానికి.
కత్తులు, కటార్లు లేవు. రక్తపాతం అసలు లేదు
ఆంధ్రదేశం తలరాతను మార్చడానికి...
ఓటు అనే పదునైన ఆయుధంతో
ఉప్పెనలా కదులుతోంది రాష్ట్రం మొత్తం.
కదులుతోంది.... దుష్టశిక్షణకై, ధర్మరక్షణకై.

- రామ్‌చంద్ర, తిమ్మలనాయుడుపాళెం, కోట, నెల్లూరుజిల్లా
Share this article :

0 comments: