మీ చేతిలోనే ఆ సువర్ణయుగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ చేతిలోనే ఆ సువర్ణయుగం

మీ చేతిలోనే ఆ సువర్ణయుగం

Written By news on Sunday, July 28, 2013 | 7/28/2013

ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, కుమ్మక్కు తెలుగుదేశానికి బుద్ధి చెప్పండి
జగనన్నను, వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ఆశీర్వదించండి
ఆ రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది
వైఎస్సార్ సిద్ధాంతాలకు విరుద్ధంగా అన్ని చార్జీలూ పెంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఇలాంటి నాయకులను నిలదీయాల్సిన చంద్రబాబు.. వారితోనే కుమ్మక్కయ్యారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 222, కిలోమీటర్లు: 2,982.4


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ ఐదేళ్లు పరిపాలన చేశారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో... తన ప్రజల గురించి ఎలా ఆలోచన చేయాలో.. ముఖ్యమంత్రి అంటే ఎలాంటి పథకాలకు రూపకల్పన చేయాలో చెప్పడానికి ఒక ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులు, మహిళలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు.. ఇలా ప్రతి ఒక్కరి గురించీ ఆలోచన చేశారు. రైతులకైతే ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వాలని కలలుగన్నారు. ప్రాజెక్టులు కట్టారు. రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారు, మద్దతు ధర ఇచ్చారు. అవసరమైతే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారమూ ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండానే అన్ని సంక్షేమ పథకాలూ అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్సార్‌ది. ఆ సువర్ణయుగం మళ్లీ రావాలంటే అది మీ(ప్రజల) చేతిలోనే ఉంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కయిన తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధిచెప్పి, జగనన్నను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యం అవుతుంది’’ అని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో సాగింది. ప్రజల కోరిక మేరకు షర్మిల చల్లవానిజంక్షన్‌లో కొద్దిసేపు ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

వైఎస్.. ఒక్క పన్నూ వేయలేదు

పాదయాత్రలో తనను కలిసి సమస్యల గోడు విప్పిన వృద్ధు లు, విద్యార్థులు, వితంతువులతో షర్మిల మాట్లాడారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. ‘‘వైఎస్సార్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఒక్కదానికి కూడా పన్ను వేయలేదు. ప్రజలపై చార్జీల భారం మోపలేదు. ‘నేను ఒక్క చార్జీ పెంచినా, పన్ను పెంచినా దాని భారం పేదవాడి మీద పడుతుంది. నా అక్కచెల్లెళ్ల మీద భారం పడుతుంది. అది నాకు ఇష్టం లేదు..’ అనే వారు వైఎస్సార్. కానీ ఇప్పుడున్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. వైఎస్సార్ ప్రతి పథకానికీఈ సర్కారు తూట్లు పెట్టింది. వైఎస్సార్ ఆశయాలకు భిన్నంగా, ఆయన సిద్ధాంతాలకు భిన్నంగా అన్ని చార్జీలనూ పెంచింది. ప్రజలంతా అల్లాడిపోతున్నా మాకెందుకు అన్నట్లు అధికారం కాపాడుకునే పనిలో ఉన్నారు ఈ కాంగ్రెస్ పాలకులు.

ప్రభుత్వాన్ని చంద్రబాబే కాపాడారు..

ప్రజలు పట్టని ఈ కాంగ్రెస్ పాలకులను నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన నిలదీయటం లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. కరెంటు చార్జీల మోతకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఈ చంద్రబాబు రెండు చేతులూ అడ్డం పెట్టి మరీ కాపాడి చరిత్రహీనుడిగా మిగిలి పోయారు. పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏం చేశాడు అంటే.. ‘వ్యవసాయం దండగ’ అన్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు ఉచితంగా వైద్యం చేయించి, ఉచితంగా మందులు అందించాలనే ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడూ రాలేదు. వాళ్ల నుంచి కూడా యూజర్ చార్జీలు వసూలు చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు.’’

13.3 కిలోమీటర్ల మేర యాత్ర..

పాదయాత్ర శనివారం 222వ రోజు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైంది. అక్కడి నుంచి రావాడపేట, నారాయణవలస, లింగాలవలస, చల్లవానిపేట జంక్షన్, గాంధారపేట, జోనంకి వరకు సాగింది. జోనంకి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.40 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13.3 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట నడిచిన వారిలో నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యే సాయిరాజు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కల్యాణి, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, బొడ్డేపల్లి పద్మజ, దుప్పల రవీంద్ర, హనుమంతు కిరణ్, నర్సునాయుడు, దవళ వెంకటగిరిబాబు తదితరులు ఉన్నారు.

‘కాంట్రాక్టు లెక్చరర్లపై సర్కారు కక్ష’

‘‘నెల రోజులకుపైగా సమ్మె చేస్తున్నాం. వేతనాల్లేక కుటుంబాలతో అవస్థలు పడుతున్నాం. అటు కాలేజీల్లోనూ తరగతులు జరక్క విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వం స్పందించడంలేదు.. మాకు న్యాయం చేయడం లేదు’’ అని పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు షర్మిల వద్ద తమ బాధలు చెప్పుకొన్నారు. నరసన్నపేట దాటిన తర్వాత జమ్మూ జంక్షన్ వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం ప్రతినిధులు హెచ్.ఆనందరావు, ఎన్.లక్ష్మీనారాయణ, దుర్గాప్రసాద్, సురేష్, సింహాచలం, భీమారావు, తదితరులు షర్మిలను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని ఆరోపించారు. తమను కొనసాగించాలని కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల స్పందిస్తూ ఈ ప్రభుత్వానికి ఎవరి సమస్యలూ పట్టడం లేదని, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు.

ఎత్తిపోతల పథకంతో బతుక్కి భరోసా
షర్మిల వద్ద ఆయకట్టు రైతుల ఆనందం

జలుమూరు, నరసన్నపేట, పోలాకి, న్యూస్‌లైన్: ‘‘అమ్మా.. మీ నాన్న వైఎస్సార్ పుణ్యాన మా బతుకులకు ఓ భ రోసా లభించింది. మా ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకంతో నాలుగు తిండిగింజలు పండుతున్నారుు... ఆకలి తీరింది.. గతంలో వేల రూపాయల పెట్టుబడితో సాగు చేసినా వరి పంట నీరులేక ఎండిపోయేది.. ఆకాశం దిక్కు చూస్తూ కాలం వెళ్లదీసేవాళ్లం.. పంట నష్టపోతే బతుకుదెరువుకోసం వలసపోయేవాళ్లం.. ఈ పరిస్థితి నుంచి మీ నాన్నే మమ్మల్ని గట్టెక్కించాడమ్మా’’ అని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లింగాలవలస, రాణా, చిన్నదూగాం, తలతరియా గ్రామాలకు చెందిన రైతులు షర్మిల వద్ద ఆనందం వ్యక్తంచేశారు. వంశధార ప్రధాన కాలువపై లింగాలవలస, రామచంద్రాపురం, జలుమూరు వద్ద సుమారు 8.86 కోట్ల వ్యయంతో వైఎస్ హయూంలో ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. దీంతో సుమారు 15 గ్రామాలకు చెందిన 3,350 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ పథకాల ప్రయోజనం పొందుతున్న రైతులు షర్మిలను కలుసుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాజన్న రుణం తీర్చుకోలేనిదమ్మా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. తలతరియా, చల్లవానిపేట, దరివాడ గ్రామాలకు కూడా ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరందించాలని రైతులు కోరారు. దీనికి షర్మిల స్పందిస్తూ త్వరలోనే జగనన్న ప్రభుత్వం వస్తుందని, మీ కష్టాలు గట్టెక్కేరోజు దగ్గరలోనే ఉందని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.
Share this article :

0 comments: