మీ ఓటే.. జగనన్న విడుదలకు బాట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ ఓటే.. జగనన్న విడుదలకు బాట

మీ ఓటే.. జగనన్న విడుదలకు బాట

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

- ‘మరో ప్రజాప్రస్థానం’లో షర్మిల పిలుపు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీరు వేసే ప్రతి ఓటూ.. అక్రమ నిర్బంధంలో ఉన్న జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘మీరు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి మీరంతా కృషి చేయాలని కోరుతున్నాం’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం విశాఖ జిల్లా గాజువాక, విశాఖ ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో సాగింది. ఈ సందర్భంగా పాత గాజువాక సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల కొద్దిసేపు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

15 కిలోమీటర్ల మేర యాత్ర: ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 199వ రోజు గురువారం విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని గాజువాక సెంటర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాతయ్యపాలెం, శీలానగర్, ఎయిర్‌పోర్టు, ఎన్‌ఏడీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం, ఏటీ జంక్షన్ మీదుగా షర్మిల నడిచారు. కంచరపాలెం మెట్ట వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు.

గురువారం మొత్తం ఆమె 15 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,652.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, సిటీ కన్వీనర్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ యాదవ్, గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, కుంభా రవిబాబు, నేతలు వైఎస్ కొండారెడ్డి, జీవీ రవిరాజు, దాడి రత్నాకర్, కొత్తపల్లి గీత, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, పీలా ఉమారాణి తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: