అభివృద్ధి నిరోధక పార్టీలను ఓడిద్దాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభివృద్ధి నిరోధక పార్టీలను ఓడిద్దాం

అభివృద్ధి నిరోధక పార్టీలను ఓడిద్దాం

Written By news on Wednesday, July 10, 2013 | 7/10/2013

టీడీపీ, కాంగ్రెస్‌లు అభివృద్ధి నిరోధక పార్టీలు
- సంక్షేమ పథకాలను వ్యతిరేకించి, రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన పార్టీలు
- కరెంటు, ఆర్టీసీ చార్జీలు, పన్నులు పెంచడం వాటి హక్కుగా భావించాయి
- ఈ రెండు పార్టీల పన్నాగాలను నిరోధించేందుకు ఈ పంచాయతీ ఎన్నికలు ఒక అవకాశం
- ఇవి విలువలు, విశ్వసనీయతకు- వంచన, కుట్రలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు
- కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయాయి.. గ్రామస్థాయిలో ఉమ్మడి అభ్యర్థులను పెట్టేందుకు వెనుకాడవు
- వారి కుట్రలను ఛేదించాలి.. సంక్షేమ శ్రేయోలాషులందరూ ఒక్కటవ్వాలి
- వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులన్నీ ఒకే బాట-ఒకే మాటగా సమరశంఖం పూరించాలి
- మళ్లీ వైఎస్సార్ సువర్ణయుగాన్ని తెచ్చుకోవడానికి ఈ ఎన్నికలను తొలి అడుగుగా భావించాలి
- కలిసి సాగుదాం.. విజయం మనదే..

సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో సంక్షేమ శ్రేయోభిలాషులంతా ఒక్కటై అభివృద్ధి నిరోధక పార్టీల అభ్యర్థులను ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను వైఎస్సార్ సువర్ణయుగం స్థాపనకు ముందడుగుగా భావించాలని, పార్టీ శ్రేణులన్నీ ఒకే మాట- ఒకే బాటగా సమరశంఖం పూరించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా మంగళవారం విజయమ్మ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

తన బిడ్డల బాగు ను కోరే ప్రతి తల్లి, తండ్రి, ఈ సమాజం క్షేమాన్ని కోరే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే అభ్యర్థులను గ్రామస్థాయి నుంచి బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రకటన సారాంశం విజయమ్మ మాటల్లోనే.. ‘‘పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్లు మొదలయ్యాయి. ఇవి పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికలు కావు. అయినా ఈ రాష్ట్రం ఒక సంధి యుగంలో ప్రయాణిస్తున్నందున ఏ అభ్యర్థిని గెలిపించుకుంటాం అన్నది... ప్రజలైన మనందరి భవిష్యత్తుకు, సంక్షేమాన్ని వ్యతిరేకించే శక్తులకు మధ్య పోరాటంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎన్నికలను మనందరి భవిష్యత్తుతో, గతంలో, ఇప్పుడూ చెల గాటం ఆడుకుంటున్న పార్టీలకు.. సంక్షేమానికి కట్టుబడిన పార్టీలకు మధ్య పోరాటంగా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ఐదేళ్ల 3 నెలల పరి పాలన సువర్ణయుగమైతే... అంతకుముందు, తర్వాత ఉన్నది శూన్య యుగం. 

ఈ ప్రభుత్వానికి, గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఎంతసేపూ ప్రజల నుంచి ఎలా డబ్బులు పిండుకోవాలా... అన్నదే ధ్యాస. తెలుగుదేశం, కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక పార్టీలు. ఇవి సంక్షేమ పథకాలను వ్యతిరేకించి సర్వనాశనం చేసిన పార్టీలు. ఇవి కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, ఇతర పన్నులను పెంచడమే తమ హక్కుగా భావించి ప్రజల్ని నానా అగచాట్లకు గురి చేసిన పార్టీలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇవి ఈ రాష్ట్ర భవిష్యత్తును అటు వ్యవసాయంలో గానీ, ఇటు పారిశ్రామికంగా కానీ, ఇతరత్రా రంగాల పరంగా కానీ, గ్రామాల పరంగా కానీ, సామాజిక వర్గాల పరంగా కానీ సర్వ నాశనం చేసిన పార్టీలు. ఈ పార్టీల పన్నాగాలను వేరు దశలోనే, మొలక దశలోనే నిరోధించటానికి ఈ పంచాయతీ ఎన్నికలను మనందరికీ అందిన సువర్ణ అవకాశంగా భావించాలని కోరుతున్నాను. ఈ పంచాయతీ ఎన్నికలను.. అభివృద్ధి నిరోధక శక్తులకు, ప్రజలు నమ్మిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు మధ్య పోరాటంగా భావించండి. ఇవి విలువలు, విశ్వసనీయతకు - వం చన, కుట్రలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ప్రారంభ పోరాటంలో విజయ మే.. ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలన్నిం టినీ తుత్తునియలు చేస్తుంది. 
Share this article :

0 comments: