ప్రలోభాలకు తలవంచని ఏకైక ప్రజానాయకుడు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రలోభాలకు తలవంచని ఏకైక ప్రజానాయకుడు జగన్

ప్రలోభాలకు తలవంచని ఏకైక ప్రజానాయకుడు జగన్

Written By news on Friday, July 26, 2013 | 7/26/2013


తండ్రిమరణానంతరం చేపట్టిన ఓదార్పుయాత్రలో జగన్ ఎన్నో అడ్డంకులను, కుట్రపూరిత రాజకీయాలను ఎదుర్కొని, తప్పనిసరి పరిస్థితుల్లో సొంతపార్టీని స్థాపించాల్సి వచ్చింది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆపార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్‌పెద్దలు జగన్‌పై కక్షకట్టారు. ఆయన తన సంస్థల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టించుకున్నారన్న ఆరోపణ మోపి, సీబీఐ ద్వారా అరెస్టు చేయించారు. అయినా జగన్ ప్రజల కోసం న్యాయపోరాటం చేస్తూ, ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి. పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. ఇది గమనించిన ఢిల్లీనాయకులు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘జగన్ కనక అధిష్టానం చెప్పిన మాట వింటే ఇంత జరిగేది కాదు’ అన్నారు.

మొదట కేంద్రమంత్రిని చేసి, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసి ఉండేవాళ్లమన్నారు. అంటే జగన్‌ను ఈ ఢిల్లీపెద్దలు ముందే ప్రలోభపెట్టారన్నమాట. కానీ జగన్ ఆ ప్రలోభాలకు తలవంచలేదు. ప్రజాభీష్టం మేరకే తను నడుచుకుంటానని తన దృఢమైన వైఖరితో తేల్చిచెప్పారు. ఇది ఆయన నడవడికను, ప్రవర్తనను తెలియజేస్తోంది. ఇన్ని సుగుణాలు, ఇంత సమర్థత ఉన్న జగన్‌ని పాలక, ప్రతిపక్షాలు ఎన్నాళ్లని వేధించగలవు? న్యాయస్థానాలను, ప్రజలను ఎన్నిరోజులు మభ్యపెట్టగలవు? న్యాయమూర్తులు అన్నివిధాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి న్యాయమూర్తుల ద్వారా త్వరలోనే తగినతీర్పు వెలువడుతుందని మేం నమ్ముతున్నాం.

- దేవారెడ్డి రోశిరెడ్డి, ఆరూరు, నెల్లూరు జిల్లా
Share this article :

0 comments: