ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్ అని తెలిసీ పోరాడుతున్న జగన్... నిజమైన హీరో! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్ అని తెలిసీ పోరాడుతున్న జగన్... నిజమైన హీరో!

ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్ అని తెలిసీ పోరాడుతున్న జగన్... నిజమైన హీరో!

Written By news on Wednesday, July 24, 2013 | 7/24/2013

కాంగ్రెస్‌తో పోరాటం అంటే మాటలు కాదు. యాభై ఏళ్ల పైబడిన రాజకీయ చరిత్ర ఉన్న కరుణానిధికి గానీ, అహంకారానికి ప్రతిరూపమని పేరుబడ్డ జయలలితకు గానీ, రాజకీయ చాణక్యుడైన ములాయంకు గానీ, మాటలతో దాడి చేయగల లాలూకు గానీ, ఆఖరికి... బి.జె.పి. ముఖ్య నాయకులకు గానీ కాంగ్రెస్‌తో పోరాటం సాగించడం సాధ్యం కాలేదు! శరద్ పవార్ అంతటివారే వేరుకుంపటి పెట్టినట్లే పెట్టి, కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగిస్తున్నారు. వీరందరూ రాజకీయ దురంధరులు, అసమాన వ్యూహకర్తలు, ప్రజాబలం కూడా ఉన్నవారు. అయినప్పటికీ... కాంగ్రెస్ అధికారంలో ఉందంటే దానికి అనుకూలంగా వ్యవహరించం తప్ప మరేమీ చేయలేకపోయారు. సీబీఐకో, మరే ఇతర కారణానికో భయపడి కాంగ్రెస్ అధినేత్రి కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోయారు. 

కానీ జగన్ వీళ్లందరికీ భిన్నమైనవారు. గిజిడ ౌజ్చీ జ్ఛ్చట ్చఛౌఠ్ట ఒ్చజ్చ అని జాతీయస్థాయి పత్రికలు సంపాదకీయాలు రాయడానికి తగిన సమర్థత చూపినవారు. రాజకీయాలకు కొత్త కానీ... కొండనే ఢీకొన్నారు. అందుకు ప్రతిఫలం అనుభవిస్తూనే ఉన్నాడుగా అని విమర్శకులు వ్యాఖ్యానించవచ్చు. అయితే జగన్‌ను జైల్లో పెట్టి కాంగ్రెస్ సాధిస్తున్నది ఏమిటి? తను సొంతంగా బలపడిందా? లేక తమకు మిత్రుడిగా ఉన్న చంద్రబాబును సంతోషపెట్టగలిగిందా? లేదే.

అధికారాన్ని కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని చేజిక్కించుకోడానికి చంద్రబాబు సందేహాలు, భయాందోళనలతోనే ‘కలిసిమెలిసి ఎవరికివారిగా’ ప్రయాణం చేస్తున్నారు. జగన్‌ని జైల్లో పెట్టామనే ఆనందం వారిలో కించిత్తు కూడా కనిపించడం లేదు. ఇక జైల్లో ఉన్న జగన్‌కు వచ్చే నష్టం ఏమీ లేదనే చెప్పాలి. జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టవలసి వచ్చిందో సీబీఐయ్యే కచ్చితంగా చెప్పలేకపోతున్న విషయాన్ని సామాన్యులు సైతం ఏనాడో గ్రహించారు. 
ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్ అని తెలిసి కూడా పోరాడుతున్న జగనే హీరో అని నిర్ధారణ అయింది. 
- మహేశ్ వెల్దుర్తి, అనంతపురం జిల్లా

జగన్‌ని చీకట్లో బంధించిన నాయకులకు ప్రజలు హై వోల్టేజ్ షాక్ ఇవ్వబోతున్నారు
జగనన్న అంటే మాకెంతో ఇష్టం. చీకటి వెంటే వెలుగు ఉంటుంది. జగనన్న నిర్బంధం రాష్ట్ర ప్రజలందరినీ అంధకారంలోకి నెట్టేసింది. ఆయన విడుదలైతే కానీ మళ్లీ ఆనాటి వెలుగులు రావు. ఆయన్ని చీకట్లో బంధించిన ఈ రాజకీయ నాయకులందరికీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ‘హై ఓల్టేజ్ షాక్’ ఇవ్వబోతున్నారన్నది నిజం. ఇది తెలియక... జగన్‌ని, ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్నవారంతా ప్రజల నిరసనల వెల్లువలో కొట్టుకుపోతారు. ఓటు అనే అస్త్రం ధాటికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులకు భవిషత్తు అన్నదే లేకుండాపోతుంది. జగన్ నిష్కళంగా జైలునుంచి విడుదల కావడం ఖాయం. మన రాష్ట్రాన్ని రాజన్న రాజ్యంలా, నిరుపేదల స్వర్గధామంలా జగనన్న మారుస్తారు. 
- పెదపాటి నవ్యనీహారిక, సిరిచందన, ప్రహసిత ముఖి, 
గాజువాక (మం), విశాఖ
Share this article :

0 comments: