జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఎల్లో మీడియా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఎల్లో మీడియా

జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఎల్లో మీడియా

Written By news on Saturday, July 13, 2013 | 7/13/2013

- జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఎల్లో మీడియా
- సత్తెనపల్లి సాక్షి చైతన్య పథంలో మేధావులు, వక్తల అభిప్రాయం

సాక్షి, గుంటూరు: ‘ప్రజాస్వామ్య చక్రాలు పట్టాలు తప్పితే దేశ భవిష్యత్తుకే ప్రమాదం.. ప్రతి మార్పునకు ప్రజా చైతన్యమే తుది తీర్పు.. ఎల్లో మీడియా జన చైతన్యాన్ని పక్కదోవ పట్టిస్తోంది.. వాటి సహకారంతో సీబీఐ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టి ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది’ అని మేధావులు, విద్యావంతులు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని గోసంరక్షణ శాల కల్యాణ మంటపంలో స్వప్న వ్యాఖ్యానంతో సాక్షి చైతన్య పథం సదస్సు శుక్రవారం జరిగింది. జనాభిమానం కలిగిన జగన్‌పై వ్యవస్థలన్నీ కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఉల్లం శేషగిరిరావు, విశ్రాంత వ్యవసాయశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌కు బెయిలిచ్చే విషయంలో సీబీఐ చెబుతున్న వాదనలు విశ్వసనీయంగా లేవన్నారు.

వైద్యుడు పమిడిమళ్ళ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలకు అస్త్రంగా మారిన సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారి ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు పాలన మరిచి జగన్ లక్ష్యంగా సంక్షేమాన్ని విస్మరించాయని బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ కరీమున్నీసా నిందించారు. చంద్రబాబు పలు భూ కుంభకోణాల్లో ఇరుక్కున్నా సీబీఐ విచారించేందుకు సిబ్బంది లేరని నిస్సిగ్గుగా చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రముఖ చిత్ర కళాకారుడు జింకా రామారావు ప్రశ్నించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు సలగా ల మృత్యుంజయరావు మాట్లాడుతూ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, కేంద్ర మాజీ మంత్రి బన్సల్ మేనల్లుడుపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఎలా క్లీన్‌చిట్ ఇచ్చిందో దేశ ప్రజలందరికీ అర్ధమైందన్నారు. సదస్సుకు విద్యార్థులు, మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
Share this article :

0 comments: