చార్జిషీట్ల పేరుతో ఎన్నాళ్లీ కాలయాపన? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చార్జిషీట్ల పేరుతో ఎన్నాళ్లీ కాలయాపన?

చార్జిషీట్ల పేరుతో ఎన్నాళ్లీ కాలయాపన?

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు
సాక్షి చైతన్యపథంలో నినదించిన చీరాల ప్రజలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన సమన్యాయం, వ్యక్తి స్వేచ్ఛ అపహాస్యం పాలవుతున్నాయని ప్రకాశం జిల్లా చీరాల పట్టణ ప్రముఖులు, వక్తలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు విషయంలో సీబీఐని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టన్నారు. డీవీఎన్ కిశోర్ వ్యాఖ్యాతగా బుధవారం చీరాలలో జరిగిన సాక్షి చైతన్యపథం కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు సీబీఐ తీరుపై మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న 1200 కేసులను విడిచిపెట్టి సీబీఐ ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులోనే అత్యుత్సాహం చూపించడం వెనుక కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుతంత్రం ఉందని ఆరోపించారు. న్యాయవాది మాగంటి జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ, జగన్‌ను అరెస్టు చేసిన 14 నెలల తరువాత కూడా సీబీఐ చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇంతవరకు ఒక్క సాక్షిని కూడా జగన్ బెదిరించినట్టు నిరూపించలేకపోయిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయన బెయిల్‌ను అడ్డుకోవడం అసమంజసమన్నారు. రిటైర్డ్ ఎస్సై బి.డేవిడ్‌రాజు మాట్లాడుతూ, ఇటీవల రైల్వే కుంభకోణంలో రూ.వేలకోట్ల ముడుపులు చేతులు మారితే ఆ శాఖ మంత్రిపై కేసు లేకుండా సోనియాగాంధీ రక్షించారని విమర్శించారు. తండ్రి ఆశయ సాధనకు ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్‌పై కేసులు బనాయించి జైలుపాలు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. 

జగన్ చట్టబద్ధంగా ఆదాయపన్ను చెల్లించి వ్యాపారం చేస్తుంటే తప్పేముందని బీసీ సంక్షేమ సంఘం నేత కర్నేటి రవికుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు, లగడపాటి, రాయపాటి, కావూరి తదితరులు వ్యాపారాలు చేస్తే చట్టబద్ధం, జగన్ చేస్తే అక్రమమా అని నిలదీశారు. కేబినెట్‌లో సమష్టిగా నిర్ణయాలు తీసుకుని అమలు పరిచిన విధానాలకు సంబంధించి మంత్రులను విడిచిపెట్టి అందులో ఎలాంటి పాత్ర లేని జగన్‌పై కేసు పెట్టడం అన్యాయమని దళిత క్రైస్తవ సమాఖ్య అధ్యక్షుడు నీలం శ్యామ్ విమర్శించారు. జననేత ప్రజల్లో ఉంటే ఢిల్లీ పీఠం దద్దరిల్లుతుందనే భయంతోనే సోనియాగాంధీ ఆయన్ను అక్రమంగా జైలు పాలు చేశారని మైనార్టీ సంఘం నేత షేక్ సిరాజ్ విమర్శించారు. ఉపాధ్యాయురాలు బి.సోఫియా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసిన మహానేత కుమారుడికి న్యాయం అందకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడేరోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: