
కేంద్ర రైల్వేశాఖ మంత్రి బన్సల్ కు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ తీరును వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీవ్రంగా ప్రశ్నించింది. జగన్ కేసులో ఒక రకంగా, బన్సల్ కేసులో మరో రకంగా వ్యవహరిస్తారా అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు ప్రశ్నించారు. బన్సల్ మేనల్లుడు సింగ్ల రైల్వే ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేశారన్నది అబియోగం.అయితే ఇందులో బన్సల్, సింగ్లల మధ్య ఫోన్ సంభాషణలు ఏమీ జరగలేదని సిబిఐ మాజీ మంత్రి బన్సల్ ను సాక్షిగా తీర్పిచ్చిందని ఆయన విమర్శించారు. జగన్ కేసులో ఆయన ఎన్నడూ సచివాలయానికి వెళ్లలేదు, ఎవరికి ఫోన్ లు చేయలేదు.ఆయన ప్రభావం చూపారనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా, పదమూడు నెలలుగా జగన్ ను నిర్భందించిందని అంబటి రాంబాబు విమర్శించారు. ఈ కేసును కొద్ది వారాలలోనే సిబిఐ పూర్తి చేసి బన్సల్ కు సర్టిఫికెట్ ఇచ్చేసిందని, మరి జగన్ కేసును నెలల తరబడి, ఏళ్ల తరబడి ఎందుకు విచారణ చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు.దీనిని బట్టే సిబిఐ పంజరంలో చిలుక అని మరోసారి తేలిందని, ఎవరి ఒత్తిడితో పనిచేస్తున్నది అర్ధం అవుతూనే ఉందని రాంబాబు వ్యాఖ్యానించారు.
courtesy:kommineni
0 comments:
Post a Comment