
వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పని చేయించుకోలేదని షర్మిల అడిగిన ప్రశ్నకు.. మరొకరు సమాధానం ఇస్తూ...ఆయన హయాంలో 8 కోట్ల 38 లక్షలు విడుదలైన మంత్రి బొత్స సత్యనారాయణ నిర్లక్ష్యం చేశారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బ్రిడ్జి చేపడతారని షర్మిల వారికి హామీ ఇచ్చారు.
ఓ వైపు వర్షం పడుతున్నా షర్మిల తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పిల్లలను, పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు కొనసాగుతున్నారు. మహిళలను ప్రభుత్వ పథకాల అమలు గురించి ఆరా తీస్తూ ముందుకు కదిలారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 206వ రోజుకు చేరింది.
0 comments:
Post a Comment