సుదీర్ఘ పాదయాత్రతో ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి మహిళ షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుదీర్ఘ పాదయాత్రతో ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి మహిళ షర్మిల

సుదీర్ఘ పాదయాత్రతో ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి మహిళ షర్మిల

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

* సుదీర్ఘ పాదయాత్రతో ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి మహిళ షర్మిల
* 212 రోజుల్లో 2,834 కి.మీ. పాదయాత్ర పూర్తి.. త్వరలోనే 3,000 మైలురాయి
* 13 జిల్లాల్లో 107 అసెంబ్లీ నియోజకవర్గాలు 1,680 గ్రామాల్లో సాగిన పాదయాత్ర
* ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. భవితపై భరోసా ఇస్తూ సాగుతున్న షర్మిల
* పాలక-ప్రతిపక్షాల కుమ్మక్కును ఎండగడుతూ ముందుకెళుతున్న వైఎస్సార్ తనయ

- ఒక మహానేత బిడ్డ... ఒక జననేత చెల్లి... జగనన్న వదిలిన బాణం... ఆమెది అలుపెరుగని పయనం!
- ఎండా, వానా, ముళ్లూ, రాళ్లూ అవాంతరాలెన్నివున్నా ఆగకుండా ముందుకెళుతున్న బహుదూరపు బాటసారి!
- బాటలు నడిచీ పేటలు కడిచీ దారిపొడవునా జనంతో మమేకమవుతూ సాగిపోతున్న విస్తృత యాత్రికురాలు! 


ఒక కుట్రను, ఒక కుతంత్రాన్ని, ఒక అణచివేతను, ఒక నిర్బంధాన్ని సవాలు చేస్తూ.. జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటతో మొదలైన షర్మిల పాదయాత్ర వడివడిగా సాగిపోతూనే ఉంది. మూడు వేల కిలోమీటర్ల దూరానికి చేరువవుతున్నా ఆమె అడుగులు అలుపెరగకుండా ముందుకు కదులుతూనే ఉన్నాయి. ఇదో ప్రపంచ రికార్డు. ఇంతటి దూరం నడిచిన మహిళా నేత మరెవరూ లేరు. ఈ సుదీర్ఘ యాత్రలో షర్మిల ఏమేం విన్నారో ఏమేం కన్నారో.. వారికి ఎలా భరోసా ఇచ్చారో అన్నది చాలా ముఖ్యం. తొంభై ఏళ్ల వయసులో వస్తున్న పెన్షన్ ఆగిపోయిన ఒక అవ్వ ఆవేదన.. భర్త చనిపోయి రెండేళ్లవుతున్నా పెన్షన్ కోసం కనీసం దరఖాస్తు కూడా లభించని ఓ వితంతువు ఆక్రోశం.. పదేళ్ల వయసులోనే చదువు మానేసి పొలంలో కూలి పని చేస్తున్న ఒక బాలిక దైన్యం.. పంటకు గిట్టుబాటు లేక అప్పుల పాలైన అన్నదాతల దుస్థితి.. ఒకరికి ఇల్లు లేదు.. మరొకరికి ఉపాధి దక్కదు.. ఇంకొకరికి వైద్యం అందదు.. ప్రతి ఇల్లూ కష్టాల కాపురమే! ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. వారి కన్నీళ్లు పంచుకుంటూ.. జగనన్న త్వరలో వస్తారని.. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని.. భరోసా ఇస్తూ షర్మిల సాగిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన ప్రతిపక్ష నిర్వాకాన్ని ఎండగడుతూ ముందుకెళుతున్నారు. 

ఒక మాటను    






అణగదొక్కాలన్న ఎత్తుగడ..! నిర్బంధించాలన్న కుట్ర... ఒక ప్రయాణాన్ని అడ్డుకోవాలన్న కుతంత్రం... జననేతను రాజకీయంగా 
 నిత్యం జనం మధ్యన ఉండాలని తపించిన జగన్‌మోహన్‌రెడ్డిని కుట్ర పూరితంగా నిర్బంధించినప్పుడు చెప్పిన మాట.. ఒకే ఒక్కమాట - ఈ ప్రజలకు బాసటగా ఉండాలని! మనల్ని అభిమానిస్తున్న ఈ ప్రజలకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలేమిటో చెప్పటమే కాదు.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ ఈ ప్రజలకు అండగా మేమున్నామంటూ జనంలో ఉండాలని చెప్పిన ఒక్కమాట! అన్న చెప్పిన ఒక్క మాటతో అడుగు ముందుకు వేశారామె. ఎండా.. వానా.. చలి... దుమ్మూ ధూళి... రాళ్లూ రప్పలు... దేనికీ వెరవలేదు. కుట్రలు, కుతంత్రాలకు భయపడలేదు. వెనుదిరిగి చూడలేదు. ఓ మహిళ.. సుదీర్ఘ లక్ష్యం... ఇంతటి సాహసోపేతమైన ప్రస్థానం చేయగలుగుతుందా? అని అంతా ఆశ్చర్యపోయిన రోజున ఆ చెల్లెలు ముందుకు అడుగువేశారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ మహిళా చేయని సాహస ఘట్టాన్ని షర్మిల పూర్తి చే శారు. తన రికార్డును తానే బద్దలు కొడుతూ అడుగులు వేస్తూనే ఉన్నారు. అతి త్వరలోనే ఆమె మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. 

కర్ర సుధాకర్‌రెడ్డి-సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అదో సాహసోపేతమైన మరోప్రస్థానం. ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి నేనున్నానంటూ తన తండ్రి దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆనాడు ఎర్రటి ఎండను లెక్కచేయకుండా ప్రజాప్రస్థానం పేరుతో సాహసోపేతమైన సుదీర్ఘ పాదయాత్ర చేస్తే.. అదే స్ఫూర్తి.. అదే నమ్మకం.. అన్న చెప్పిన మాట.. ప్రజల ఆదరాభిమానాలు.. అన్నిటినీ గుండెల్లో నింపుకుని ముందుకు కదిలారు షర్మిల. ముందున్న లక్ష్యం ఆషామాషీ కాదు. మార్గం సులభం కాదు. సుదీర్ఘ ప్రయాణం. తండ్రి బాట.. అన్న మాట.. నిత్యం మననం చేసుకుంటూ ప్రజల మధ్యన అడుగేశారు. గత ఏడాది అక్టోబర్ 18న తన తండ్రి దివంగత వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి.. ఆయన ఆశీస్సులతో, తల్లి విజయమ్మ దీవెనతో కదిలారు. అక్కడ మొదలైన మరో ప్రజాప్రస్థానం ఇప్పటికీ 212 రోజులుగా నిరాఘాటంగా సాగుతోంది. ఇప్పటివరకూ చరిత్రలో ఏ మహిళా నడవని దూరం నడిచారు. మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరువయ్యారు. 

ఎండైనా.. వానైనా.. లెక్కచేయక... 
షర్మిల ఇడుపులపృయ నుంచి బయలుదేరాక వైఎస్సార్ జిల్లాలో, అనంతపురం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నంత సేపు దాదాపు వారం పది రోజుల పాటు వర్షాలు కురిశాయి. అయినా ఆమె నడక ఆపలేదు. వర్షంలో తడుస్తూనే పాదయాత్ర సాగించారు. ఉరవకొండ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు వెళుతున్నప్పుడు అక్కడ రహదారులు లేక అడుగు తీసి అడుగు వేయలేని బురదలోనూ ఆమె అడుగులు ఆగలేదు. అలుపెరుగక ముందుకు సాగారు. వర్షాలు పోయాక గుంతకల్లు సమీపం నుంచి మళ్లీ దట్టమైన దుమ్ము, ధూళీ. పాదయాత్రకు వేలాది మందిగా తరలిరావటంతో దుమ్ము రేగిపోతోంది. జనం తాకిడితో తోపులాటులు, తొక్కిసలాటలూ చోటు చేసుకున్నా జనసైన్యం కదం తొక్కుతూనే ఉంది. కర్నూలు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల మీదుగా గుంటూరు చేరిన షర్మిలకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. ఎండలు మండుతున్నా షర్మిల చెరగని చిరునవ్వుతో చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల సమస్యలు వింటూ వారికి రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ధైర్యం చెప్తూ ముందుకు సాగారు. 

వ్యథార్థ జీవిత యధార్థ దృశ్యాల్...
మరో ప్రజాప్రస్థానం ప్రయాణంలో.. కనిపిస్తున్నదీ వినిపిస్తున్నదీ.. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. వచ్చిన పెన్షన్ తీసేశారని 90 ఏళ్ల అవ్వలు, భర్త చనిపోయి రెండేళ్లయినా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఇవ్వటం లేదని వితంతువులు, ఉన్న పెన్షన్ తీసేశారని వికలాంగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఐదుగురు ఉన్నా బియ్యం 16 కిలోలే ఇస్తున్నారని, ఇల్లు మంజూరై సగంలో ఆగి మూడేళ్లుగా బిల్లు రాలేదని ప్రజలు షర్మిలకు తమ గాథలు చెప్పుకుంటున్నారు. అక్కా ఫీజులు లేక చదువులు ఆగిపోయాయి.. అని చెల్లెళ్లు, తమ్ముళ్లు చెప్పే వ్యథలు. పావలా వడ్డీ ఎక్కడిది... రూపాయిన్నర నుంచి రెండు రూపాయల వడ్డీ పడుతోందన్న మహిళల వేదన.

పంటలు ఎండిపోయాయని కొందరి.. వచ్చిన కాస్త పంటకూ ధర రాలేదని.. వానలు లేవు, ఎరువులు, విత్తనాలు దొరకటం లేదని... రైతన్నల ఆవేదన. ఉచితంగా 7 గంటలు కరెంటు వచ్చిన చోట.. ఇప్పుడు కనీసం రెండు మూడు గంటలు కూడా వ్యవసాయానికి కరెంటు రాక అన్నదాతల అష్టకష్టాలు. ఎరువుల ధరలు నాలుగు రెట్లయ్యాయి. ఇన్‌పుట్ సబ్సిడీలు అందవు. పెట్టుబడుల్లో సగమైనా చేతికి రాదు. టమాటా పంట చేతికొచ్చేసరికి ధరను చూసి రైతులు రోడ్లపై పారబోస్తున్నారు. ఉల్లి రైతుకు గిట్టుబాటు దొరకక కన్నీళ్లే మిగిలాయి.

వేరుశనగ రైతు కాత లేక, పంట ఎండిపోయి ఒక చేయూత కోసం ఎదురుచూస్తున్నాడు. ఏ గ్రామంలో చూసినా రైతు దయనీయ పరిస్థితి. ఒక్కో కుటుంబానికి ఒక్కో కష్టం. వారిని ఎలా ఓదార్చాలో అర్థంకాని పరిస్థితి. ఆదుకునేందుకు ఎవరో వస్తారని ఎదురుచూస్తున్న వారిని చూసి షర్మిల చలించిపోయారు. ‘‘అన్నా... అవ్వా... అక్కా... అన్నా.. చెల్లీ... ఒక్కటే మాట చెప్తున్నా... జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మీ కష్టాలు తీరుతాయి. రైతు మళ్లీ తలెత్తుకుని గౌరవంగా జీవించే రోజులొస్తాయి. జీవితానికి వెరవకండి. భరోసాతో బతకండి...’’ అంటూ ఆ చెల్లి వారి కన్నీటిని తుడుస్తున్నారు.

భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ...
నడుస్తూ వెళ్లే దారి వెంట.. చదువు మానేసి చేలల్లో పత్తి ఏరుతూ కనిపించిన నిరుపేద బాలికలు ఎందరో. గుంతకల్ సమీపంలో పదేళ్ల రాజేశ్వరి అనే చిన్నారి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న తీరు షర్మిలను కదిలించింది. పేదరికం వల్ల ఎంత పెద్ద చదువైనా ఆగిపోకుండా చూసే బాధ్యతను జగన్ తీసుకుంటారని ఆమె విద్యార్థులకు ధైర్యం చెప్తున్నారు. అమ్మ ఒడి పథకం కింద పదో తరగతి వరకు రూ. 500, ఇంటరైతే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1,000 ఆ విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేస్తామని జగనన్న ఇచ్చిన మాటను గుర్తుకు తెస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు. పంటకు గిట్టుబాటు కోసం రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారంటూ ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో జగనన్న ఇచ్చిన మాటలను గుర్తుచేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయక, కాలువలకు నీళ్లివ్వకపోవటంతో అటు సాగునీరుకు, ఇటు గ్రామాల్లో తాగునీరుకు కొరత ఏర్పడింది. 

తాగునీటి ఎద్దడితో, కరెంటు లేక బోర్లు పనిచేయక మహిళలు మళ్లీ కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ నీళ్లు తెచ్చుకుంటున్నారు. జగన్ సీఎం అయ్యాక తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని షర్మిల వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆరోగ్యశ్రీ అంద ని ద్రాక్షగా మారిందని, 108కు ఫోన్ చేసినా డీజిల్‌కు డబ్బు లేదంటున్నారన్న అభాగ్యుల ఆక్రందనకు ‘జగనన్న వస్తాడు.. మళ్లీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా మనల్ని నడిపిస్తాడు’ అంటూ ధైర్యం చెప్తున్నారు. 

పాలక, ప్రతిపక్షాల కుమ్మక్కును ఎండగడుతూ 
పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. కరెంటు సమస్య కావొచ్చు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కావొచ్చు. పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్.. వృద్ధుల నుంచి చిన్నారుల వరకు ఎదురవుతున్న ఇబ్బందులు, వారిని ఆదుకోవటంలో విఫలమైన ప్రభుత్వాన్నీ, అలాగే ఆ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరిని ఎండగడుతున్నారు. పాలక కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపిన సాక్ష్యాలను ప్రజల ముందు పెడుతున్నారు. ‘నిత్యావసర వస్తువుల ధరలు మండుపోతున్నాయి. అటు కరెంటు చార్జీల మోత. ఇటు ఆర్టీసీ చార్జీల వాత. ఇది చాలదన్నట్టు 4 శాతం అమ్మకం పన్ను పెంపు.. పేదవాడు ఒక్కపూట భోజనం చేయలేని పరిస్థితి. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి అన్నింటా ఘోరంగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలదీయాల్సిందిపోయి దానితోనే కుమ్మక్కయ్యారు. 

అవిశ్వాసం పెట్టమంటే డ్రామాలాడుతున్నారు. అవిశ్వాసం కాదు.. అవసరమైతే చంద్రబాబు విశ్వాస తీర్మానం పెట్టేలా ఉన్నారు...’ అని యాత్ర మొదలైన పదో రోజే షర్మిల చెప్పారు. ఆ రోజు నుంచి దాదాపు ప్రతిరోజూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధికార కాంగ్రెస్‌తో ఏ రకంగా కుమ్మక్కయి పనిచేస్తున్న విషయాన్ని ఎండగడుతూనే ఉన్నారు. ఈ పాలన మాకొద్దని ప్రతిచోటా ప్రజలు చెబుతుంటే.. అవిశ్వాసం పెట్టరెందుకని టీడీపీని నిలదీశారు.

కాలికి శస్త్ర చికిత్సతో స్వల్ప విరామం
నిర్విఘ్నంగా సాగుతున్న షర్మిల పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నప్పుడు ఆమె కాలికి అయిన గాయం కారణంగా కొద్దిరోజులు నడకను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా బీఎన్‌రెడ్డి నగర్‌లో జరిగిన సభలో మాట్లాడిన తర్వాత వేదిక దిగుతున్నప్పుడు కిందపడిన కారణంగా షర్మిల కాలికి తీవ్ర గాయమైంది. మొదట్లో దాన్ని గమనించకపోగా ఆ తర్వాత నాలుగు కిలోమీటర్ల మేర నడిచి ఇంజాపూర్ చేరుకునే సరికి నొప్పి నడవలేని స్థాయికిచేరుకోవటంతో వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మోకాలికి శస్త్ర చికిత్స చేయాలని సూచించటంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 

మోకాలికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కనీసం 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోకపోతే నొప్పి తిరగదోడుతుందని చెప్పారు. అనంతరం ఫిబ్రవరి 6వ తేదీన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ నుంచి షర్మిల తిరిగి పాదయాత్ర మొదలుపెట్టారు. అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ డిసెంబర్ 9న ఒకరోజు పాదయాత్రకు విరామమిచ్చారు. 

వైఎస్ స్ఫూర్తి... జగన్ పట్టుదల...
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ చార్జీల మోతలు, కరువు కాటకాలు చుట్టుముట్టిన సమయంలో.. ప్రజలను, ముఖ్యంగా రైతాంగాన్ని అదుకునే నాథుడెవరూ కనిపించని తరుణంలో.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి తానున్నానంటూ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను ఓదార్చి, వారి కష్టాల కన్నీళ్లను తుడవాలని 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పేరుతో సుదీర్ఘ కాలినడకకు శ్రీకారం చుట్టారు. దాదాపు 40 డిగ్రీల ఎండ తీవ్రత ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి ఏకబిగిన 68 రోజుల పాటు 1,475 కిలోమీటర్లు నడిచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకున్నారు. ముందుగా నిర్దేశించిన ప్రణాళిక మేరకు 11 జిల్లాలు 56 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సాగిన పాదయాత్రలో దారిపొడవునా లక్షలాది కుటుంబాల కష్టాలు, కన్నీళ్లను వైఎస్ చూశారు.

ఓదార్చారు. కష్టాలు తీరే రోజొస్తుందని హామీ ఇచ్చారు. అదే తరహాలో.. ఆయన తనయుడు జగన్ తాను ఇచ్చిన మాట కోసం అదే ఏప్రిల్ 9వ తేదీ 2010లో ఓదార్పుయాత్రకు శ్రీకారం చుట్టారు. 13 జిల్లాల్లో ఓదార్పుయాత్ర కొనసాగించారు. దాదాపు 300 రోజులకుపైగా 17 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి 2,500 పైగా సభల్లో ప్రసంగించారు. వైఎస్ స్ఫూర్తిని, జగన్ పట్టుదలను పుణికిపుచ్చుకున్న షర్మిల తండ్రిని తలపిస్తూ.. జగనన్నను గుర్తుకుతెస్తూ.. సుదీర్ఘ యాత్ర ప్రారంభించారు. చిన్నారులను ముద్దాడుతూ.. కూలిపని చేసుకుంటున్న అవ్వలను ఆప్యాయంగా హత్తుకున్నారు. తండ్రిలా, అన్నలా ‘ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి అక్కకూ.. ప్రతి చెల్లెలికి, ప్రతి అన్నకు.. ప్రతి తమ్ముడికి.. మీరు చూపిస్తున్న ఆప్యాయతకు చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా...’ అంటూ అభిమానిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

జనం గుండెల్లో నమ్మకం నింపుతూ...
తన పాదయాత్ర రాజకీయాల కోసం కాదని, ప్రజల ఆవేదన తెలుసుకునేందుకేనని షర్మిల రుజువు చేస్తున్నారు. ఒక ధైర్యం చెప్పటానికేనని తన చిత్తశుద్ధిని కనబరుస్తున్నారు. నిజాయితీ గల పాదయాత్రగా మలిచారు. ప్రజల వాడుక భాషలో మాట్లాడుతూ.. వారి కష్టాలను తెలుసుకుంటూ, వారి అవసరాలను ప్రతి ఒక్కటీ అడిగి తెలుసుకుంటున్నారు. ఓపికగా వారి సమస్యలు వింటున్నారు. మహిళలను ముందుకొచ్చి మాట్లాడమంటున్నారు. 2009లో ఎన్నికలకు ముందు రాజశేఖరరెడ్డి చేసిన జైత్రయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన ఓ బహిరంగ సభలో ‘ఓ అక్కా.. నువు నా సొంత అక్కలా ఉన్నావ్.. ఇక్కడికి రా.. వేదికపైకి వచ్చి మాట్లాడుదువ్ గానీ.. ఓ చెల్లెమ్మా.. నువ్ కూడా రా.. ఓ చెల్లెమ్మా.. ఇలా రా’ అంటూ సంబోధించారు. అచ్చం తండ్రిలాగే షర్మిల కూడా ‘ఓ అవ్వా.. ఓ పింక్ రంగు చీర కట్టుకున్న అవ్వా.. ఇలా రా.. ముందుకు రా..’ అంటూ అదే ఆత్మీయతను చూపించారు. 

దారివెంట ఎక్కడ వృద్ధురాలు కనిపించినా, వికలాంగుడు కనిపించినా వారిని పలకరించకుండా ముందుకు కదలలేదు. దారిలో నలుగురు ఎదురైనా.. ఊళ్లో నాలుగు వేల మంది రచ్చబండ వద్ద కూర్చున్నా ఒకేరీతిలో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా వారి బతుకుచిత్రాన్ని తెలుసుకుంటున్నారు. బడిపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న బాధలు తెలుసుకుంటూ, సర్కారు వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. 

జగనన్న వదిలిన బాణాన్ని... 
‘‘నేను మీ రాజన్న కూతురుని. మీ జగనన్న చెల్లెలిని. నా పేరు షర్మిల’’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూనే.. ‘‘నేను రాజన్న పాదాన్ని. జగనన్న విడిచిన బాణాన్ని’’ అంటూ తాను వచ్చిన పనేంటో చెప్తూ ఆమె ముందుకు కదిలారు. 

అక్టోబర్18నమొదలు ఇప్పటివరకు 12 జిల్లాల్లో పూర్తి చేసుకుని 13వ జిల్లా విజయనగరంలో నడక సాగిస్తున్న షర్మిల 2,830 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. వైఎస్సార్ జిల్లాలో మొదలుపెట్టి.. అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల మీదుగా విజయనగరం జిల్లాలో ప్రవేశించారు. 

దారిపొడవునాఅవ్వలు, తాతలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు.. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. షర్మిల ఇప్పటి వరకూ రెండు వందలకు పైగా సభల్లో ప్రసంగించారు. జగనన్నపై జరుగుతున్న కుట్రలేమిటో విడమరిచారు. ప్రజలు పడుతున్న బాధలేమిటో అర్థం చేసుకున్నారు. ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమేంటో ఎండగట్టారు. జగనన్న వస్తారని.. కష్టాలు తీరే రోజు వస్తుందని భరోసా ఇస్తున్నారు. 

రికార్డు యాత్రగా చెప్పుకున్న చంద్రబాబు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 2012 అక్టోబర్ 2న ‘వస్తున్నా.. మీకోసం’ పేరుతో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభించి 208 రోజుల పాటు పాదయాత్ర చేసి విశాఖపట్నంలో ముగించారు. చంద్రబాబు 2,495 కి.మీ. మేర పాదయాత్ర చేసినప్పటికీ 2,823 కిలోమీటర్లు చేసినట్లు ప్రకటించుకున్నారు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేసిన కొత్తలో ఉదయం నడక ప్రారంభించినప్పటికీ.. ఎండల తీవ్రతతో కొద్ది రోజుల తర్వాత ఆయన ప్రతి రోజూ సాయంత్రం ఆలస్యంగా యాత్రను మొదలుపెట్టి ప్రజలు నిద్రావస్థలో ఉన్నవేళ అర్ధరాత్రి దాటిన తర్వాత ముగించారు.
Share this article :

0 comments: