కాంగ్రెస్, టీడీపీలపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజం
- ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నందునే జగన్‌పై అక్రమ కేసులు
- జగన్‌ను ఇబ్బందులపాలు చేయడంలో భాగంగానే మోపిదేవిని బలిచేశారు
- మోపిదేవిని వారం రోజుల్లో విడిపిస్తామన్నారు..
- జైలుకు పంపాక పట్టించుకోవడం మానేశారు
- వైఎస్సార్ సీపీలో చేరిన మోపిదేవి సోదరుడు, కుమారుడు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రపూరితంగా అరెస్టు చేసి కాంగ్రెస్, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ‘‘నల్లకాలువ వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలతో మమేకమవుతూ వారి ఆదరాభిమానాలు చూరగొనడంవల్లే కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి జగన్‌బాబుపై అక్రమ కేసులు బనాయించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా 15 నెలలపాటు ఉన్న కాలంలో ఎలాంటి కేసులూ లేవు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే జగన్‌పై కేసులు బనాయించారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులో జగన్‌ను ఇబ్బందుల పాలు చేసేందుకు వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణను బలిచేశారు. మోపిదేవిని వారం రోజుల్లో బయటకు తెస్తామని చెప్పి జైలుకు పంపిన తర్వాత పట్టించుకోవడమే మానేశారు’’ అని విజయమ్మ దుయ్యబట్టారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాథ్‌బాబు, కుమారుడు రాజీవ్‌లతో పాటు రేపల్లె నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారందరికీ విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ ఎలాంటి నేరం చేయలేదని ఆమె స్పష్టంచేశారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులో జగన్‌ను ఇబ్బందులపాలు చేయడంతో పాటు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 26 జీవోలు సక్రమమా కాదా చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించి, ఎనిమిది నెలల గడువు ఇచ్చినా స్పందించలేదని తప్పుబట్టారు. ఆరోజే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే అసలు కేసే ఉండేది కాదన్నారు.
బిజినెస్ రూల్స్ ప్రకారమే జీవోలు జారీ అయ్యాయని మంత్రులు సుప్రీం కోర్టుకు నివేదించారని, అలాం టప్పుడు కేసు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే వారిచ్చిన ప్రతిఫలం ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా పేర్కొనడం, ఆయన కుటుంబానికి సీబీఐ వేధింపులు, జగన్‌కు బెయిల్ కూడా రాకుండా వందల కుట్రలు చేయడమని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారి పాపం పండినరోజు దేవుడే దిగొచ్చి అంతమొందిస్తారని హెచ్చరించారు. జగన్ త్వరలోనే బయటకొస్తారని, ఆలోపు ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మెజార్టీ పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. సాధారణ ఎన్నికలు కూడా నవంబర్ లేదా డిసెంబర్‌లో వచ్చే అవకాశముందని, ఇప్పటినుంచే అందరూ గట్టిగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన నాయకులు...
హరినాథ్‌బాబు, రాజీవ్‌లతో పాటు రేపల్లె నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు ప్రసాదం వాసుదేవ, చింతల శ్రీకృష్ణయ్య, గరికపాటి బానుకోటి, మాజీ జెడ్పీటీసీలు యార్లగడ్డ భాగ్యలక్ష్మి, ఎం.సుధాచంద్రహాస్‌రావు, పి.గంగాపార్వతి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు మరకా శ్రీనివాసరావు, నల్లపాటి రామయ్య, 50 మంది మాజీ ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచులు, దాదాపు 500 మంది ముఖ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
- ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నందునే జగన్‌పై అక్రమ కేసులు
- జగన్‌ను ఇబ్బందులపాలు చేయడంలో భాగంగానే మోపిదేవిని బలిచేశారు
- మోపిదేవిని వారం రోజుల్లో విడిపిస్తామన్నారు..
- జైలుకు పంపాక పట్టించుకోవడం మానేశారు
- వైఎస్సార్ సీపీలో చేరిన మోపిదేవి సోదరుడు, కుమారుడు

వారందరికీ విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ ఎలాంటి నేరం చేయలేదని ఆమె స్పష్టంచేశారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులో జగన్‌ను ఇబ్బందులపాలు చేయడంతో పాటు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 26 జీవోలు సక్రమమా కాదా చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించి, ఎనిమిది నెలల గడువు ఇచ్చినా స్పందించలేదని తప్పుబట్టారు. ఆరోజే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే అసలు కేసే ఉండేది కాదన్నారు.
బిజినెస్ రూల్స్ ప్రకారమే జీవోలు జారీ అయ్యాయని మంత్రులు సుప్రీం కోర్టుకు నివేదించారని, అలాం టప్పుడు కేసు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే వారిచ్చిన ప్రతిఫలం ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా పేర్కొనడం, ఆయన కుటుంబానికి సీబీఐ వేధింపులు, జగన్‌కు బెయిల్ కూడా రాకుండా వందల కుట్రలు చేయడమని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారి పాపం పండినరోజు దేవుడే దిగొచ్చి అంతమొందిస్తారని హెచ్చరించారు. జగన్ త్వరలోనే బయటకొస్తారని, ఆలోపు ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మెజార్టీ పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. సాధారణ ఎన్నికలు కూడా నవంబర్ లేదా డిసెంబర్‌లో వచ్చే అవకాశముందని, ఇప్పటినుంచే అందరూ గట్టిగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన నాయకులు...
హరినాథ్‌బాబు, రాజీవ్‌లతో పాటు రేపల్లె నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు ప్రసాదం వాసుదేవ, చింతల శ్రీకృష్ణయ్య, గరికపాటి బానుకోటి, మాజీ జెడ్పీటీసీలు యార్లగడ్డ భాగ్యలక్ష్మి, ఎం.సుధాచంద్రహాస్‌రావు, పి.గంగాపార్వతి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు మరకా శ్రీనివాసరావు, నల్లపాటి రామయ్య, 50 మంది మాజీ ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచులు, దాదాపు 500 మంది ముఖ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
0 comments:
Post a Comment