రాజకీయ కక్ష సాధింపులు ప్రజానాయకుడిని ఏమీ చేయలేవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ కక్ష సాధింపులు ప్రజానాయకుడిని ఏమీ చేయలేవు

రాజకీయ కక్ష సాధింపులు ప్రజానాయకుడిని ఏమీ చేయలేవు

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013

జగన్ కోసం జనం, జనం కోసం జగన్. ఈ మాట ముమ్మాటికీ నిజం. నా వయసు 73. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటివరకు వై.ఎస్. లాంటి ప్రజాహిత ముఖ్యమంత్రిని చూడలేదు. జగన్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజాసంక్షేమం కోసం పాటు పడగలరని ఇప్పటికే రూఢీ అయింది. తన తండ్రి మరణించిన తరువాత ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి జగన్ ప్రజల మధ్యకు వెళ్లారు. అందుకు ఆగ్రహించిన కాంగ్రెస్‌పార్టీ ఆ యువనాయకుడు పార్టీ వీడేలా ప్రతీకార చర్యలకు పాల్పడింది. ఆ తర్వాత పాలక, ప్రతిపక్షాలు కలిసి, సీబీఐ సహకారంతో జగన్‌ను జైలుకు పంపి, ఏడాది దాటినా బెయిల్ రాకుండా అడ్డుకుంటూనే ఉన్నాయి.

చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడిగా కంటే, అధికారపార్టీ భాగస్వామిగానే ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకొని తన మీది నేరారోపణలపై దర్యాప్తు జరగకుండా హామీలు పొందారు. అందుకే ఆయన తనెంతో నిజాయితీపరుడినని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా ఎవరూ నమ్మట్లేదు. చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చెయ్యి కలిపి ఆయన ఆడుతున్న రాజకీయ ఫిక్సింగ్ నాటకాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు అధికార, ప్రతిపక్షపార్టీలకు ఒకేసారి తగిన గుణపాఠం చెబుతారు. ఇది తథ్యం.

చంద్రబాబు ఇంతకుముందెప్పుడో ఒకసారి తన రక్తంలో ప్రవహిస్తున్నది 75 శాతం టీడీపీ, 25 శాతం కాంగ్రెస్ రక్తం అని అన్నట్లు గుర్తు. కాబట్టి చిరంజీవి తన పీఆర్పీని కాంగ్రెస్‌కు అమ్ముకుని కేంద్రమంత్రి అయినట్లే, చంద్రబాబు కూడా పై పాట్లన్నీ పడకుండా తన టీడీపీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు తన మీద ఉన్న నేరారోపణలను ఇంకా సులువుగా మాఫీ చేసుకోవచ్చు. ప్రజానాయకుడు జగన్ జైలుపాలు అయినంత మాత్రాన దోషి కారు. ఈ రాజకీయ కక్ష సాధింపులు ఆయన్ని ఏమీ చేయలేవు. ఎన్నికలెప్పుడొచ్చినా ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజల ఆదరాభిమానాలతో బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ విషయాన్ని ఇంతకుముందు జరిగిన ఉపఎన్నికలే నిరూపించాయి. అందువల్లనే అధికార పార్టీ ఏ ఎన్నికనైనా నిర్వహించడానికి భయపడుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు. 

- మిత్తిరెడ్డి సింహాచలం, ప్రత్తిపాడు, ప.గో.జిల్లా

రాజన్న తరువాత లభించిన నాయకుడు జగనన్న...

తెలుగు పౌరుషాత్మకు కొత్త విశ్వాసాన్ని నింపడానికి, తెలుగుజాతి ఖ్యాతి భారతజాతికి చూపి ముందుకు నడపడానికి రాజన్న తరువాత రాష్ట్ర ప్రజలకు లభించిన నాయకుడు జగనన్న...

ఇప్పుడు జరుగుతున్నది జగన్నాటకం... జగనన్న చుట్టూ నడుస్తున్న నాటకం. ఢిల్లీ డెరైక్షన్‌లో సీబీఐ విలన్‌గా నటిస్తూ నడుపుతున్న, నడుస్తున్న నాటకం... జనులకు అనర్థాలు తెస్తున్న పాలకపక్షానికి ప్రతిపక్షం భుజం తట్టి న్యాయానికి కళ్ళు లేవని న్యాయదేవత ముందు వెర్రితలలు వేసిన వాదనలతో గంతులేస్తున్న నాటకం... 

నేనడుగుతున్నాను...జనంలో ఒకడిగా జనంతో ఒకడిగా జనమంతా ఒకటిగా... భారతీయ సంప్రదాయం పాటిస్తాను అన్నందుకా ఇంత కక్ష! ఏడాదిన్నరగా కేవలం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌రావు మరో పార్టీ అధినేతగా ఉన్న జగన్‌పై వేసిన పిల్‌ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిని నిర్బంధించారు. మరి పూర్తి సాక్ష్యాధారాలతో మాజీముఖ్యమంత్రిపై మరో ఎమ్మెల్యే విజయమ్మ వేసిన పిల్‌ని రాజకీయకక్షతో వేసిందని ఎలా అనుకుంటాం? ఎందుకు ఆ పిల్‌ని తిరస్కరించారు?

చట్టం ముందు అందరూ సమానం కాదనే భావనని జనులలో కల్గించారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మన ప్రాధాన్యత మనకే అని, ఢిల్లీ తల్లి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే మరి! ప్రజలు ఆలోచిస్తున్నారు రేపటి కోసం పొలాలు పచ్చగా కళకళలాడవు. రైతులు ఆకాంక్షిస్తున్నారు ఉచిత వెలుగులు నిండాలని విద్యార్థులు ఊహించుకుంటున్నారు భవిష్యత్తు బంగారమై నిలుస్తుందని... మాకు మేముగా బ్రతకాలంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి, జగనన్న సీఎం కావాలి.

- ఈమని ఫణీంద్రరెడ్డి, మున్నంగి, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా.
Share this article :

0 comments: