జగనన్న బయటికి వస్తేనే... ప్రజల గోడు ప్రభుత్వానికి వినిపిస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న బయటికి వస్తేనే... ప్రజల గోడు ప్రభుత్వానికి వినిపిస్తుంది

జగనన్న బయటికి వస్తేనే... ప్రజల గోడు ప్రభుత్వానికి వినిపిస్తుంది

Written By news on Monday, July 1, 2013 | 7/01/2013

మా ఫ్యామిలీ అంతా వైఎస్సార్‌గారి అభిమానులం. నేను వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌వల్ల బీటెక్ పూర్తిచేయగలిగాను. వైఎస్సార్ ఉన్నారు అని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది అని ఎంటెక్‌లో జాయినయ్యాను. ఆయన హఠాన్మరణం వలన రీయింబర్స్‌మెంట్ ఆగిపోయింది. ఇక ఈ ‘తెలుగు-కాంగ్రెస్’ ప్రభుత్వం అందిస్తుందన్న నమ్మకం మాకు కలగటం లేదు. ఈ తరుణంలో జగనన్న, విజయమ్మ విద్యార్థుల గురించి అనేక దీక్షలు చేశారు. జగనన్న బయట ఉంటే ప్రజాసమస్యల కోసం నిత్యం పోరాడుతున్నాడని, పోరాడుతూనే ఉంటాడని, నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నాడని ఈ ‘తెలుగు-కాంగ్రెస్’ నాయకులు కుట్రలు పన్ని జైలుపాలు చేశారు. వైఎస్సార్ అండతో రాజకీయాల్లో ప్రవేశించి, ఆయన దయతో ఎమ్మెల్యేలు గెలిచి, మంత్రి పదవులు అనుభవిస్తూ ఆ మహనీయుడి కుటుంబ ప్రతిష్ఠను బజారుకీడుస్తూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. 

దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్క కుటుంబం గమనిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబం ఓటు అనే ఆయుధంతో ఈ రెండు పార్టీలకు, ఇవి చేసే నీచ రాజకీయ నాయకులకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వైఎస్సార్‌ని చూసి, ఆయన చేసిన సంక్షేమ పథకాలను చూసి, ఆయనే మా నాయకుడని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రజలు గెలిపించారు. ఇప్పుడు ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్నారు. దీనిని కనిపించని దేవునితో పాటు, కనిపించే వైఎస్సార్ ప్రతిమ చూస్తూనే ఉంటుంది. రానున్న రోజుల్లో రాజన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ జగనన్న అమలుచేస్తాడని, పేదప్రజలు, విద్యార్థుల కలలను నెరవేరుస్తారని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. జగనన్న త్వరగా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

- డాకా భరత్‌రెడ్డి, అద్దంకి, ప్రకాశం జిల్లా

ఒక్కసారి అభిమానించారంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు

జగనన్నను లోపల పెట్టి, గుంటనక్కల్లా బయట తిరుగుతూ ఆయనకు బెయిల్ రాలేదని తెలిసిన ప్రతిసారీ సంబరాలు జరుపుకుంటున్న కుటిల రాజకీయ నాయకులారా... ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు ఎంతోదూరంలో లేదు. జగనన్న కానీ, ఆయన కుటుంబం కానీ ఎవరికీ అన్యాయం చేయలేదు. పాలకపక్షం, ప్రతిపక్షం ఏకమై జగన్‌కు బెయిల్‌వస్తే మేం ప్రజల్లో తిరగలేం అని అంటున్నారంటే దాన్నిబట్టే అర్థమవుతోంది జగనన్నకు ఉన్న ప్రజాదరణ ఎంతటిదో! మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజల మనసులో ఉన్న జగనన్నను, వైఎస్సార్‌ను దూరం చేయలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి అభిమానించడం మొదలుపెట్టారంటే, వారు జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. 

ప్రజలకు సేవ చేయడం, వారి కష్టాల్లో పాలుపంచుకొని, వారికి ఏదో విధంగా సహాయం చేయడం, ప్రజాజీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని జగనన్న ఎప్పుడూ చెబుతుంటారు. ధీరులైనవారు మాత్రమే ఆయనలా నిజాయితీగా ఉండగలరు. ధైర్యం అంటే కండరాలలో కూడిన శారీరక బలం కాదు. సాహసం, ఓర్పు, నీతి నిజాయితీల ఆచరణ. పేదప్రజలకు మేలు చేయాలనే దృఢసంకల్పం. అవన్నీ జగనన్నలో ఉన్నాయి. వైఎస్సార్‌గారు తలపెట్టిన పవిత్ర ఆశయాలను జగనన్న నెరవేర్చాలనే సంకల్పం తప్పక సత్ఫలితాలను అందిస్తుంది. మహాపురుషుల జీవిత చరిత్రలు చదివితే, వారి విజయానికి మూలకారణం... ఎన్ని విషమ పరిస్థితులు ఎదురైనా ఓర్పుతో కష్టాలను దాటుకుని ముందుకు సాగిపోగల ధైర్యమేనని తెలుస్తుంది. జగనన్న ధీశాలి. అంతిమ విజయం ఆయనదే. 

- మల్కిరెడ్డి హనుమంతరెడ్డి, జమ్మలమడుగు
Share this article :

0 comments: