మంచినీరొద్దు.. మద్యమే ముద్దు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంచినీరొద్దు.. మద్యమే ముద్దు..

మంచినీరొద్దు.. మద్యమే ముద్దు..

Written By news on Friday, July 12, 2013 | 7/12/2013

మరో ప్రజాప్రస్థానం 12-07-2013మూడులాంతర్ల సెంటర్(విజయనగరం) 12 జూలై 2013: మంచినీరు వద్దు.. మద్యమే ముద్దు అనే విధానంతో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం సాగుతోందని శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. విజయనగరం జిల్లా మూడు లాంతర్ల సెంటర్లో  శుక్రవారం సాయంత్రం ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె విజయనగరం జిల్లాలో  పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో బొత్స కుటుంబం నుంచి నలుగురు రాజకీయాలలో ఉన్నారని ఆమె చెప్పారు. బొత్స సత్యనారాయణ మంత్రి కాగా.. ఆయన భార్య ఝాన్సీలక్ష్మి ఎమ్.పి.గా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇంతమంది ఉన్నా విజయనగరం పట్టణానికి కూడా మంచినీరు అందడం లేదన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తారకరామ సాగర్ నుంచి మంచినీళ్లివ్వాలని భావించారనీ, రూ. 70 కోట్లు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించారనీ శ్రీమతి షర్మిల చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు. ఆయనుండుంటే ఈ పాటికి పనులు పూర్తయ్యి ప్రజలకు మంచినీరు అంది ఉండేవన్నారు. బొత్సకు చిత్తశుద్ధి కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆమె విమర్శించారు. ఆయన చిత్తశుద్ధి ఎంతో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. మంచినీరు వద్దు.. మద్యమే ముద్దు అనే విధానాన్ని ఆయన అవలంబిస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుత ముఖ్మమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు కుంటుపడిందన్నారు. పక్కా ఇళ్ళ పథకానికి పాడె కట్టారన్నారు. పింఛన్లను పెంచకపోగా ఉన్న వాటిని  తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమ కార్యక్రమాలకు గోరీ కడుతున్న వీరిని నాయకులనాలా.. రాక్షసులనాలా అని ఆమె ఆవేశంగా ప్రశ్నించారు. 

డాక్టర్ వైయస్ఆర్ ఉండి ఉంటే ఇప్పుడు రైతులకు తొమ్మిదిగంటల విద్యుత్తు ఇచ్చి ఉండేవారు. గతంలో ఆయన నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్తు సరఫరా ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇప్పడు మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. కరెంటు సరఫరా లేక వేల పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఈ పాపం కాంగ్రెస్ సర్కారుదేనని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.
కరెంటు లేదు మహాప్రభో అంటే కిటికీలు తెరుచుకోండీ, గాలి బాగా వస్తుందని కిరణ్ సలహా ఇస్తున్నారన్నారు.  కరెంటు సరఫరా నిల్లు బిల్లులు ఫుల్లుగా ప్రభుత్వ విధానం మారిపోయిందన్నారు. గ్యాస్ ధర విపరీతంగా పెరిగిందన్నారు. సబ్సిడీ లేకపోతే వెయ్యి రూపాయలు పెట్టి సిలిండర్ కొనాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.  ఆర్టీసీ చార్జీలను నాలుగు సార్లు ప్రభుత్వం పెంచిందన్నారు. అన్ని పన్నులు పెరిగాయని ప్రజలు వాపోతున్నారని చెప్పారు. విద్యుత్తు అదనపు చార్జీల రూపేణా ప్రభుత్వం 30వేల కోట్ల  రూపాయల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపిందని ఆమె తెలిపారు.

ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దానికి మద్దతు పలకవద్దని విప్ జారీ చేశారన్నారు. మద్దతు పలికుంటే ఈ ప్రభుత్వం కూలిపోయేదనీ, ప్రజలకు  బాధలు తప్పేవని చెప్పారు. చిరంజీవి కేంద్ర మంత్రి పదవి కోసం తనకు ఓటేసిన 70 లక్షల మంది ఓటర్లను పిచ్చోళ్ళను చేసి  ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ కు రాసిచ్చేశారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీరామారావుగారు పెట్టిన టీడీపీ పార్టీని కూడా చంద్రబాబు ప్రజలను పిచ్చోళ్ళను చేసి తాకట్టు పెట్టారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మైనారిటీ లో ఉంది. మైనారిటీ ప్రభుత్వం ఎలా అధికారంలో ఉందని ప్రశ్నించారు. ఇది చంద్రబాబు వల్లే సాధ్యమైందన్నారు. 

మంచి వాడనుకుని పిల్లనిచ్చిన ఎన్టీ రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రయ్యారనీ, ఆయన కుమారులలో ఒకర్ని సీఎం చేస్తానని మాటమాత్రంగానైనా అనలేదని చెప్ఆరు. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్నే వెలేశాడంటే చంద్రబాబు ఎంత నీచుడో తెలుస్తుందన్నారు. వ్యవసాయం దండగనీ,  సబ్సిడీలిస్తే ప్రజలు  సోమరులవుతారని చెప్పింది ఈ చంద్రబాబేనన్నారు. ఉపకారవేతనాలు అడిగిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయించారని చెప్పారు. పింఛను అడిగితే ఊళ్ళో ఎవరైనా చనిపోతే ఇస్తానని చెప్పేవాడని తెలిపారు. ఆయన హయాంలో గ్యాస్ ధర 130 నుంచి 305కు పెరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాజన్న ఇస్తానన్న ఉచిత విద్యుత్తుని హేళన చేశారన్నారు. ఏటా కరెంటు చార్జీలు పెంచుతానని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం  చేసుకుని చంద్రబాబు రాష్ట్రానికి రుణం తెచ్చారని చెప్పారు. కరెంటు బిల్లలు చెల్లించాలని ప్రబుత్వం పెట్టిన వేధింపులు తట్టుకోలేక వేలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని శ్రీమత షర్మిల గుర్తుచేశారు. రెండెకరాలతో మొదలైన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఎక్కడ చూసిన హెరిటేజే దుకాణాలే అనే రీతిలో పెరిగిందన్నారు. దేశ విదేశాలలో హెరిటేజ్ దుకాణాలు తెరిచారని చెప్పారు. ఐఎమ̴్జీ సంస్థకు 2500 కోట్ల రూపాయల విలువైన భూమిని రూ. 4 కోట్లకే అప్పగించిన ఘనత చంద్రబాబు సొంతమని చెప్పారు. కమ్యూనిస్టులు ఆయనపై చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అనే పుస్తకాన్ని రాసిన విషయాన్ని గుర్తుచేశారు.  ఇలాంటివి ఆయన ఎన్నో చేశారనీ అయినా ఆయనపై కేసులుండవనీ, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడమే దీనికి కారణమని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఏఏ అంశాల్లో కుమ్మక్కయ్యారో శ్రీమతి షర్మిల సభలో వివరించారు.


http://www.ysrcongress.com/news/top_stories/sharmila-hasted-botsa-liquor-policy.html

Share this article :

0 comments: