Judicial overreach-ఆ తీర్పును కొట్టేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » Judicial overreach-ఆ తీర్పును కొట్టేయాలి

Judicial overreach-ఆ తీర్పును కొట్టేయాలి

Written By news on Saturday, July 13, 2013 | 7/13/2013


Judicial overreach

However well-intentioned the Supreme Court might be in its efforts to cleanse the political system of criminals, its decision to bar any person who is in jail or in police custody from contesting an election to legislative bodies is a case of the remedy being worse than the disease. By extending the curtailment of the right to vote of a person in prison or lawful police custody to the right of the person to stand in an election, the Supreme Court has, in effect, left the door open for the practice of vendetta politics by ruling parties. All that politicians in power now need to do to prevent rivals from contesting an election is to ask the police to file a case and effect arrest. 

ఆ తీర్పును కొట్టేయాలి

జైల్లో ఉండే వ్యక్తులు పోటీకి అనర్హులన్న సుప్రీం ఉత్తర్వులపై సీపీఎం
కేసుల్లో దోషిగా తేలితే అనర్హులేనన్న తీర్పును సమీక్షించాలని సూచన

న్యూఢిల్లీ/సహర్సా (బీహార్): జైలు లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు చట్టసభలకు పోటీ చేసేందుకు అనర్హులన్న సుప్రీంకోర్టు తీర్పుపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో సర్వోన్నత న్యాయస్థానం తన పరిధిని అతిక్రమించిందని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేదిగా ఉన్న ఈ తీర్పును కొట్టేయాలని కోరింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత తీర్పు వల్ల విచారణ ఖైదీలతోపాటు దోష నిర్ధారణ జరగని వ్యక్తులు, విచారణ లేకుండా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసే హక్కుకు దూరమవుతారని తెలిపింది. ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఎన్నో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని...లక్షలాది మంది విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గుతూ న్యాయ వ్యవస్థ అసమర్థత, వివక్ష కారణంగా ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని సీపీఎం పేర్కొంది. పైగా ఈ తీర్పు అమలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని వివరించింది. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీలు లేదా ప్రభుత్వాలు వ్యక్తులను జైళ్లలో పెట్టించవచ్చని తెలిపింది. 


ఎగువ కోర్టుల్లో నిర్దోషిగా తేలితే...

క్రిమినల్ కేసుల్లో శిక్షకు గురైన చట్టసభ సభ్యులు తక్షణమే అనర్హతకు గురవుతారంటూ బుధవారం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఆ తీర్పు హర్షణీయమైనప్పటికీ చట్టసభ సభ్యులు ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా మూడు నెలలపాటు వారి సభ్యత్వాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 (4)ను సర్వోన్నత న్యాయస్థానం చట్టవిరుద్ధమంటూ కొట్టేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని సీపీఎం వివరించింది. ప్రస్తుత న్యాయ వ్యవస్థలో కింది కోర్టుల తీర్పులను ఎగువ కోర్టులు కొట్టేసిన సందర్భాలు ఉంటున్నాయని గుర్తుచేసింది. ఒకవేళ ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేను దిగువ కోర్టు తీర్పు ప్రకారం తక్షణమే అనర్హుడిగా ప్రకటించాక అతను లేదా ఆమె ఎగువ కోర్టులో నిర్దోషిగా బయటపడితే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. అందువల్ల ఈ తీర్పును సమీక్షించాలని కోరుతున్నట్లు తెలిపింది. 

Share this article :

0 comments: