జగన్ విడుదల ఒక్కటే ఇప్పుడు... ప్రజాస్వామ్య ఉనికికి ప్రబల నిరూపణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ విడుదల ఒక్కటే ఇప్పుడు... ప్రజాస్వామ్య ఉనికికి ప్రబల నిరూపణ

జగన్ విడుదల ఒక్కటే ఇప్పుడు... ప్రజాస్వామ్య ఉనికికి ప్రబల నిరూపణ

Written By news on Thursday, August 1, 2013 | 8/01/2013

జగన్ విడుదల ఒక్కటే ఇప్పుడు... ప్రజాస్వామ్య ఉనికికి ప్రబల నిరూపణ
జగన్ కోసం: 431 రోజులు:  దివంగతనేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్మోహనరెడ్డి కాంగ్రెస్‌పార్టీని వదిలి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌పార్టీ పెట్టడంతోనే కాంగ్రెస్ అధిష్ఠానం కలవరం చెందింది. తాటిచెట్టు మీద మర్రి విత్తనం పడి మొలకెత్తి, పెరిగి, మహావృక్షంగా వృద్ధి చెంది తాటిచెట్టునే మింగినట్టు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తమను నామరూపాలు లేకుండా చేస్తుందని భీతిల్లిన కాంగ్రెస్‌పార్టీ... తెలుగుదేశం సహకారంతో, సీబీఐ తోడ్పాటుతో జగన్‌ని జైలుకు పంపింది. బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా, రాష్ట్ర ప్రజలకు జగన్ కుటుంబంపై ఉన్న ఆదరాభిమానాలు తరిగిపోవు. ఎందుకంటే, ఎందరో పేదల కన్నీటిని తుడిచిన గొప్ప నాయకుడి తనయుడిగా జగన్ మరో గొప్ప నాయకుడు అయ్యాడు కాబట్టి. ఇప్పుడు జరగవలసింది ఒక్కటే... ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని నిరూపణ కావడం. జగన్ విడుదలే ప్రజాస్వామ్య ఉనికికి ప్రబలమైన నిరూపణ.  
- బి.నూకరాజు, బడ్డుమర్రి, శ్రీకాకుళం జిల్లా

దొంగదాడి చేసి నిర్బంధించడం యుద్ధనీతి అనిపించుకోదు
పెద్దాయన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు, కడగండ్ల గురించి తెలుసుకున్నట్లు, ఆయన తనయుడు జగన్ ఓదార్పుయాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై, వారి ఆత్మబంధువయ్యారు. వై.ఎస్.గారు అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాలను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడం ఈ రాష్ట్రంలో ఒక్క జగన్‌కి మాత్రమే సాధ్యమౌతుంది. అందుకే ఆయన్ని తక్షణం విడుదల చేయాలని మేమంతా కోరుతున్నాం. విచారణ పేరుతో జగ న్‌పై చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేస్తూ ఎన్నికలయ్యే వరకు ఆయన్ని బయటికి రానీయకుండా చేయడం కాంగ్రెస్ వ్యూహం లా కనిపిస్తోంది. ఇది పిరికిచర్య. ప్రత్యర్థిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి కానీ, దొంగదాడి చేసి నిర్బంధించడం యుద్ధనీతి అనిపించుకోదు. ఏ నీతీ లేనప్పుడు యుద్ధనీతి మాత్రం ఎందుకనుకున్నారేమో కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు జగన్‌తో పోరాటానికి కుటిల నీతులను మాత్రమే ఎన్నుకున్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకపక్షాలు చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని, రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్‌కు న్యాయం దక్కకుండా చేస్తున్నాయి. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ ఆత్మస్థయిర్యాన్ని, విజయమ్మ ఒంటరి పోరాటాన్ని, షర్మిల మరోప్రజాప్రస్థానంలో కురుస్తున్న పూలవాన ల్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. న్యాయస్థానాలు ఎటువైపున్నా, తాము మాత్రం జగన్ వైపేనని త్వరలోనే తీర్పు par ఇవ్వబోతున్నారు.
- కట్టా అప్పారావు, కట్టా రామకృష్ణ, కట్టా శివకృష్ణ, డి.రాజు,
ఆర్.బి.కొత్తూరు, పెద్దాపురం, తూ.గోజిల్లా

అక్రమంగా సంపాదించి ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండిపోయేవారుగా!
Jagan reddy would have remained in congress if he accumulates illegal property
జనం నమ్మి, అభిమానించిన జననాయకుడు జగన్. ఈ మూడు అక్షరాల్లోనే యువతరాన్ని నడిపించే స్ఫూర్తి ఉంది. నిరుపేదకు బతుకుదారి చూపే మంత్రశక్తి ఉంది. రాజన్న వారసుడు జగనన్నే అని రాష్ట్రమంతా ఎదురుచూస్తున్న తరుణంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని ప్రజలకు దూరం చేసి, జైలుగోడలకు పరిమితం చేసింది. అక్రమంగా సంపాదించారని ఆయన మీద ఆరోపణ మోపింది! నిజానికి జగన్ అన్యాయంగా సంపాదించి ఉంటే దాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్‌లోనే ఉండిపోయేవారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే ధైర్యంగా బయటికి వచ్చి ప్రజల పక్షాన నిలబడ్డారు. ఈరోజు ఈ నాయకులంతా జైల్లో ఉన్న జగన్‌పైనే దృష్టిని కేంద్రీకరించారు. ప్రజలకు జగన్‌ను దూరం చేయడమే మా అజెండా అన్న వైఖరి వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ తప్పు చేశారని ఏ సాక్ష్యాధారాలూ లేవు. అవి లేకుండా దర్యాప్తు ఏమిటో! ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవకుండా ఉండాలంటే జగన్ వెంటనే విడుదల కావాలి. అప్పుడే న్యాయం, ధర్మం అనే మాటలకు par విలువ.ఙ- బి.హిమబిందు, కన్నాపురం, కొయ్యలగూడెం, ప.గో.జిల్లా

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: