సీఎం జిల్లాలో బోల్తాకొట్టిన కాంగ్రెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం జిల్లాలో బోల్తాకొట్టిన కాంగ్రెస్

సీఎం జిల్లాలో బోల్తాకొట్టిన కాంగ్రెస్

Written By news on Friday, August 2, 2013 | 8/02/2013

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ బోల్తాకొట్టింది. సింగిల్ విండో ఎన్నికల్లో అధికార బలంతో, దౌర్జన్యంగా డీసీసీబీ పీఠం దక్కించుకున్న కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పా రు. చాలా చోట్ల తెలుగు కాంగ్రెస్ కలిసి అభ్యర్థులను పెట్టినా వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారుల ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయారు. ఎక్కువ మండలాల్లో ఇదే ఫలితాలు మొదటి, రెండు, మూడవ విడతల్లో ప్రతిఫలించాయి.
 
 జిల్లాలో 1,357 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఇందులో ఏకగ్రీవాలు 293 ఉన్నాయి. ఏకగ్రీవాలు కలుపుకుని వైఎస్‌ఆర్‌సీపీ 596 పంచాయతీలు కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. తెలుగుదేశం 398 స్థానాలతో రెండోస్థానంలో నూ, కాంగ్రెస్ పార్టీ 229 స్థానాల్లో గెలిచి మూ డవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో 123మంది స్వతంత్రులు గెలిచారు. వీరి లో ఎక్కువమంది వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మద్యం, డబ్బులు, తాయిలాలు విచ్చలవిడిగా పంచినా, స్థానికంగా చిన్న, చిన్న కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టినా పంచాయతీ ఎన్నికల్లో వారి పాచిక పారలేదు. ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకే పట్టం కట్టారు. ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పార్థసారథి, మంత్రి గల్లా అరుణకుమారి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సీఎం సోదరుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
 
 తొలి నుంచి కుమ్మక్కు
 సింగిల్ విండోల్లో ఒకే పడవపై ప్రయాణం చేసి న కాంగ్రెస్ టీడీపీలు అదే ఒరవడిని పంచాయ తీ ఎన్నికల్లోనూ కొనసాగించాయి. ముఖ్యంగా సీఎం ప్రాతనిథ్యంవహిస్తున్న పీలేరు నియోజ కవర్గంలోనూ, చంద్రబాబు ప్రాతినిథ్యం వహి స్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ కుమ్మక్కు బహిర్గతమైంది. పుంగనూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో చాలా పంచాయతీల్లో ఉమ్మడిగా అభ్యర్థిని వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులపై పోటీకి నిలబెట్టారు. ఇంతచేసినా మూడో విడతలో 199 స్థానాల్లో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ 122 స్థానాల్లో, 104 స్థానాలు సాధించా యి. 14 నియోజకవర్గాల్లో కనీసం ఆరు నియోజకవర్గాల్లో మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో పడింది. కొన్నిచోట్ల తెలుగుదేశం అభ్యర్థులనే తమ అభ్యర్థులుగా ప్రకటించి ఓట్లేయమన్నారు.
 
 సీఎం నియోజకవర్గం పీలేరులో కేవీ పల్లె, కలికిరి, వాయల్పాడు, పీలేరు మండలాల్లో వైఎస్‌ఆర్ సీపీ పాగా వేసింది. వాయల్పాడు మండలంలో కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న చింతపర్తి, గండబోయినపల్లె, కూరపర్తి, చింతలవారిపల్లె, నగరి మడుగు, మాధవరం వంటి 8 పంచాయతీల్లో వైఎస్‌ఆర్ సీపీ జెండా రెపరెపలాడింది. కలకడలో మూడు పంచాయతీల్లో, కేవీపల్లె మండలంలో ఒక పంచాయతీలో వైఎస్‌ఆర్ సీపీ సత్తా చాటింది. కలికిరి మండలంలో మేడికుర్తిలో గెలిచారు. చంద్రబాబు ప్రాతిని థ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 17 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. కేవీపల్లె మండలంలో ఒక్క పం చాయతీ కూడా టీడీపీ సాధించకపోవడం గమనార్హం. పీలేరు మేజర్ పంచాయతీలో కూడా ఐదు వార్డులను వైఎస్‌ఆర్ సీపీ గెలుచుకుంది.
 
 మంత్రి గల్లాకు పరాభవం
 మంత్రి గల్లా అరుణకుమారి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెంలో 12 పంచాయతీల్లో 4 వైఎస్‌ఆర్ సీపీ గెలవగా, ఒకటి టీడీపీ, కాంగ్రెస్ ఒకటి గెలిచారు. ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించారు. చిన్నగొట్టిగల్లు మండలంలో 12 పంచాయతీల్లో ఐదు వైఎస్‌ఆర్ సీపీ గెలవగా, మూడు కాంగ్రెస్, నాలుగు టీడీపీ గెలిచాయి. చంద్రగిరి, పాకాల మండలాల్లో వైఎస్‌ఆర్ సీపీ, తెలుగుదేశం పోటీపడగా, కాంగ్రెస్‌కు అవకాశం లేకుండాపోయింది. తిరుపతి రూరల్‌లోనూ ఇదే పరిస్థితి. రామచంద్రాపురంలోనూ వైఎస్‌ఆర్ సీపీ విజయకేతనం ఎగురవేసింది.
Share this article :

0 comments: